Breaking News

జర్నలిస్టుల ఆరోగ్య సమస్యలు తీరనున్నాయ్..

0

ఎన్నాళ్లో వేచిన ఉదయం ఇన్నాళ్లకు పలకరించినట్టుంది.. ఏపీలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అమలైన ఆరు నెలల తర్వాత తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ జర్నలిస్టుల హెల్త్ కార్డులపై సంతకం చేశారు. మంగళవారం నిజంగా జర్నలిస్టులకు మంగళకరమైన రోజే.. తెలంగాణ ఏర్పడి సంవత్సరం కాలంగా వివిధ జబ్బులు, రోగాల బారిన పడి చాలా మంది జర్నలిస్టులు మృత్యువాత పడ్డారు.

సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జర్నలిస్టుల నుంచి కొంత మొత్తం ప్రీమియంగా వసూలు చేసి 2 లక్షల వరకు హెల్త్ కవరేజ్ ఇచ్చింది ప్రభుత్వం.. దీని ద్వారా వేల మంది జర్నలిస్టులు డబ్బులు కట్టి ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పాత సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని పథకం పనిచేయలేదు.. తెలంగాణ ప్రభుత్వం కొత్త హెల్త్ పాలసీని తీసుకురాలేదు. దీంతో చాలా మంది జర్నలిస్టులు వైద్యం  అందక.. వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక చనిపోయారు.

ఎట్టకేలకు జర్నలిస్టులకు హెల్త్ కార్డుల దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేయడంతో తెలంగాణలో ఇక జర్నలిస్టు మిత్రులకు హెల్త్ కార్డులు అందనున్నాయి.. తెలంగాణ ఏర్పాటు తర్వాత దాదాపు సంవత్సరం మీద 1 నెలకు జర్నలిస్టుల బాధలకు విముక్తి కలిగింది.. ఈ పథకం వర్కింగ్ జర్నలిస్టులందరికీ వరం కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *