జర్నలిస్టుల అక్రిడిటేషన్, హెల్త్ కార్డులపై నివేదికను కేసీఆర్ కు సమర్పించిన కమిటీ

హైదరాబాద్ : జర్నలిస్టుల అక్రిడిటేషన్, హెల్త్ కార్డుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ తన తుది నివేదికను సీఎం కేసీఆర్ కు గురువారం సమర్పించింది. మీడియా అక్రిడిటేషన్ల కోసం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు కేసీఆర్ ను కలిసి జర్నలిస్టులకు వెంటనే ఈ కార్డులని మంజూరుచేయాలని కోరారు.

కాగా దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. వెంటనే దీనిపై ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనంతరం అల్లం నారాయణ విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆ శాఖ కమిషనర్ ను కేసీఆర్ ఆదేశించారని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *