జర్నలిస్టులూ.. చలో హైదరాబాద్..

హైదరాబాద్ : మన రాష్ట్రంలో మన యూనియన్ ప్రథమ మహాసభలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) ప్రథమ మహాసభలు ఏప్రిల్ 19న ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నాంపల్లి లోని కామ్రేడ్ షోయబుల్లాఖాన్ ప్రాంగణంలోని లలిత కళాతోరణం పబ్లిక్ గార్డెన్ లో ఈ మహాసభలు జరుగనున్నాయి.

కాగా రాష్ట్ర మహాసభలపై పోస్టర్ ను టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్ ,  టీయూడబ్ల్యూజే మీడియా కమిటీ కన్వీనర్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ అయిలు రమేశ్ లు విడుదల చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *