
‘మార్కెటింగ్’ జర్నలిస్ట్..
మనసులో అనిపించకపోయినా.. కళ్లలో కనిపించాలి..
గుండెలోతుల్లో లేకపోయినా.. మాటల్లో పలికించాలి..
‘జోకు’తున్నామని తెలిసినా.. ఆపకుండా ‘జోకాలి’..
‘లెక్కలు’ తెలిసినా..
‘విలువల’ గురించి చెపుతుండాలి..
కడుపు ‘ఆకలి’తో కాలిపోతున్నా..
పైకి మాత్రం ‘యుద్దం’ చేయాలి..
అంతా ‘వ్యాపారం’ అయ్యాక..
‘మార్కెటింగ్’ ఎగ్జిక్యూటివ్ అయితే ఏంటి..
మార్కెటింగ్ జర్నలిస్ట్ అయితే ఏంటి..
రెంటికి పెద్ద తేడా ఏం లేదు..