జర్నలిస్టులతో కిక్కిరిసిన లలితకళాతోరణం…

journlist mahasaba mahasabaహైదరాబాద్ : టీయూడబ్ల్యూజే ప్రథమ మహాసభ అంచనాలకు మించి వివిధ జిల్లాల నుండి జర్నలిస్టులు తరలి వచ్చారు. ఆదివారం ఉదయం 11.00 గం,లకు హైదరాబాద్ లోని లలితకళాతోరణం పబ్లిక్ గార్డెన్ లో జరిగిన టీయూడబ్ల్యూజే తొలి మహాసభకు 6 నుంచి 7 వేల మంది హాజరవుతారని యూనియన్ నాయకులు అంచనా వేయగా వారి అంచనాలకు మించి దాదాపు 8వేల మంది జర్నలిస్టులు ఈ మహాసభకు హాజరయ్యారు. పబ్లిక్ గార్డెన్ లోని లలితకళాతోరణం జర్నలిస్టులతో కిక్కిరిసిపోయింది. ఈ సభకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, భారీ నీటి పారుదల శాఖ మంత్రి  తన్నీరు హరీష్ రావు, టి.డి.ఎల్.పి నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, బీ.జే.పీ.ఎల్.పి నాయకులు డా.లక్ష్మణ్, సి.పి.ఐ ఎల్.పి నాయకులు రవిందర్ కుమార్, దుబ్బాకా ఎం.ఎల్.ఎ సొలిపేట రామలింగా రెడ్డి , మాజి ఎం.ఎల్.సి ఆర్.సత్యనారాయణ, ఐజేయూ అధ్యక్షులు ఎస్.ఎన్ సిన్హా , సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, మాజీ సెక్రటరీ జనరల్,  టీయూడబ్ల్యూజే ముఖ్య సలహాదారులు కే శ్రీనివాసరెడ్డి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కే. అమర్ నాథ్,   సీనియర్ సంపాదకులు రాంచంద్రమూర్తి(సాక్షి), సినియర్ పాత్రికేయులు వరదాచారి, ప్రముఖ రచయిత నందిని సిద్దారెడ్డి, టి.ఎన్.జి.ఓ ల రాష్ర్టా అధ్యక్షులు రవిందర్ రెడ్డి హాజరై ప్రసంగించారు.
ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…సమాజంలో జర్నలిస్టులకు గొప్ప గౌరవం వుంది. జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఆ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు.
తెలంగాణలో పని చేసే జర్నలిస్టులందరికి 4 లక్షల రూపాయల వ్యయంతో తో డబుల్ బెడ్ రూంలతో ఇళ్లు నిర్మిస్తామన్నారు. 2 లక్షల రూపాయల తో ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు. తక్షణం జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్లు మంజురు చేస్తామన్నారు.  10 కోట్ల రూపాయల వ్యయంతో జర్నలిస్టుల భవనం నిర్మిస్తామన్నారు.
జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు ఉన్నత విధ్యను అభ్యసించేందుకు జర్నలిస్టుల కోసం ప్రత్యేక యూనివర్పిటిని ఏర్పాటు చేసే ప్రతిపాదన సి.ఎం పరిశీలనలో ఉందన్నారు.
జర్నలిస్టులు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు:- ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ జర్నలిస్టుల వల్ల తెలంగాణ సాకారమైంది అన్నారు.  కేంద్రం మెడలు వంచింది జర్నలిస్టులే,  తెలంగాణ తెచ్చింది జర్నలిస్టులే. తెలంగాణాలో టి.ఆర్.ఎస్ అధికారంలోకి రావడానికి కూడా జర్నలిస్టులే కారణం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన జర్నలిస్టులే నేడు అనేక సమస్యలలో సతమతమవుతున్నారు.
జర్నలిస్టుల పోరాటం ద్వారానే, జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అవసరమైతే కే.సి.ఆర్ ఇంటి ముందు జర్నలిస్టులు బైటాయించాలన్నారు. . ఈ జర్నలిస్టుల సంఘంలో కే.శ్రీనివాస రెడ్డి, దేవులపల్లి అమర్ లాంటి పోరాట యోధులు ఉన్నారని, మీరంతా వారితో కలిసి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని, మీ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేసారు.

ఈ కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే రాష్ర్టా అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షత వహించారు.  టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యధర్శి కే.విరాహత్ అలి,  కార్మికశాఖ డిప్యూటి చీఫ్ కమీషన్ యు.కే దాస్ , ఐజేయూ నాయకులు యం.ఎ యాజీద్, కే.సత్యనారాయణ,  దాసరి కృష్ణారెడ్డి, వై.నరేందర్ రెడ్డి, ఏపియూడబ్ల్యూజే రాష్ర్టా  అధ్యక్షులు నల్లి ధర్మారావు,  టీయూడబ్ల్యూజే కోశాధికారి కే.మహిపాల్ రెడ్డి,  మీడియా కమీటీ కన్వీనర్ అయిలు రమేష్, రాష్ర్టా ఉపాధ్యక్షులు తాడూరి కర్ణాకర్, రాష్ర్టా కార్యదర్శి రవికాంత్ రెడ్డి, కె.రాంనారాయణ, కె.ప్రభాకర్ రెడ్డి, హేచ్.యు.జే అధ్యక్షులువె వెలిచాల చంద్రశేఖర్, కార్యదర్శి కో్ఠిరెడ్డి, రాష్ర్టా నాయకులు ఏ.రాజేష్, సంపత్ కూమార్, పిట్టల రాజేందర్,  దొంతు రమేష్, అంగిరేకుల సాయిలు,  జి.శ్రీనివాస్(పేపర్ శ్రీనన్న),  కంచే కూమార స్వామి, శివకూమార్, వెంకటరమణ, తాటికోండ భాస్కర్, వీణవాణి, ఎన్.ఎస్.ఎస్ tuwj tuwj లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రావు, గాండ్ల శ్రీనివాస్, శ్రీనివాస్ మెదక్, వెంకట్ రెడ్డి, శంకర్ గౌడ్ తధితరులు  పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *