
సగటు మనిషి ఆవేదన.ఆక్రందనకు ప్రతిరూపాలు పాత్రికేయులని కాకతీయ యూనివర్సిటీ మాజి ఉపకులపతి లయన్స్ క్లబ్ తెలంగాణ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మేన్ ప్రొఫెసర్ వంగాల గోపాల్ రెడ్డి అన్నారు.వరంగల్ లయన్స్ జిల్లా 320 ఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు డే పురష్కరించుకొని శుక్రవారం రాత్రి రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న 30 మంది సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టు.లయన్ నరెందర్ అద్యక్షత వహించగా ముఖ్యఅతిధిగా తెలంగాణ మల్టిపుల్ కౌన్సిల్ చేర్మన్ వంగాల గోపాల్‌రెడ్డి.ప్రత్యేక ఆహ్వనితులుగా పౌర సంబందాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి ఎస్ జగన్ నాయక్.వరంగల్ లయన్స్ జిల్లా 320 ఎఫ్ ఉప గవర్నర్లు కేసి జాన్ బన్ని.పొట్లపల్లి శ్రీనివాస రావు.సీనియర్ లయన్ పోకల చందర్ లు హజరయ్యారు.ఈ సందర్బంగా వంగాల మాట్లాడుతూ పాత్రికేయ వృత్తి కత్తిమీది సాములాంటిదని.అలాంటి వృత్తిని ఎంచుకొని అందరి సమస్యలన్ని తమ సమస్యలుగా భావించి వార్తలు వ్రాసి సమాజం దృష్టికి తీసుకుపోవం గొప్ప కార్యమన్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థలోపాత్రికేయులు పాత్ర ఘననీయం అన్నారు.పత్రికలో ప్రచురించిన వార్త ప్రభావం చాలా గొప్పదని.ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధిగా పనిచేస్తున్న పాత్రికేయులను సన్మానించుకోవడం మంచి పరినామమని అన్నారు.జర్నలిజం వృత్తిలో విశ్వసనీయత అవసరమన్నారు.సమాజంలో జరుగుతున్న అనేక అంశాలను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కార మార్గం చూపుతున్నారని అన్నారు.సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి.అభివృద్దికి పాత్రికేయులు కృషి అభినందనీయమని వంగాల కొనియాడారు.ఈ సందర్బంగా ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు.తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల అసోషియేషన్ రాష్ట్ర కోషాధికారి.తెలుగు ఫీపుల్ డాట్ కమ్ ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో చీప్ వేముల సదానందం నేతను పుష్పగుఛ్చాలు.శాలువ.ప్రసంశ పత్రం అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సీనియర్ జర్నలిస్టు పెండెం వేణుమాదవ్ వ్యవహరించారు.ఇంకా తౌజేండ్ ఫిల్లర్ లయన్స్ క్లబ్ అద్యక్షులు పాము శ్రీనివాస్.లయన్స్ కె రాజగోపాల్ రెడ్డి.కిషోర్.లవకుమార్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.ఈ సన్మాన కార్యక్రమాన్ని తౌజేండ్ ఫిల్లర్ లయన్స్ క్లబ్ హోస్ట్ చేసింది.