
రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలంలోని చిన్నమంగళారం గ్రామ శివారులో గల “మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా”(మెఫి) సంస్థకు చెందిన భూమిలో శనివారం నాడు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ళ శాసన సభ్యులు యాదయ్య లు మొక్కలు నాటారు. మెఫి, ఐజేయు, టీయుడబ్ల్యుజెల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐజేయు అధ్యక్షులు దేవులపల్లి అమర్, టీయుడబ్ల్యుజె సలహాదారులు కె.శ్రీనివాస్ రెడ్డి, ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయుడబ్ల్యుజె అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఎపియుడబ్ల్యుజె అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ.వి.సుబ్బారావు, చందు జనార్దన్, ఐజేయు కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, డి.సోమసుందర్, ఆలపాటి సురేష్, సీనియర్ నాయకులు కె.అమర్ నాథ్, టీయుడబ్ల్యుజె రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు కె.శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా కమిటీ సభ్యుడు సలీం లతో పాటు జిల్లాలోని పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాన్ని చేపట్టిన మెఫి, టీయుడబ్ల్యుజె బాధ్యులను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.