Breaking News

జర్నలిస్టులకు సీఎం కేసీఆర్ అన్యాయం

amar

హైదరాబాద్ : బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్.. జర్నలిస్టులకు మాత్రం పీడకలను మిగులుస్తున్నారని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకులు మండిపడ్డారు. హైదరాబాద్ లో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు ఇవ్వాలని మంగళవారం జర్నలిస్టులు నిరసన దీక్షకు దిగారు. సంవత్సరన్నర గడిచినా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వలేదని దీనివల్ల ఇప్పటికే వివిధ రోగాలతో 150 మంది జర్నలిస్టులు అసువులు బాసారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని వారు కోరారు..

k srini

ఈ నిరసనలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కే. అమర్ నాథ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు కే.సత్యనారాయణ, ఎంఏ మాజిద్, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ (టోమ్జా) రాష్ట్ర అధ్యక్షులు అయిలు రమేశ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేశ్, బల్మూరి విజయసింహారావు, హెచ్ యూ జే కార్యదర్శి వెలిచాల చంద్రశేఖర్, రంగారెడ్డి అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి బాలరాజు, యూనియన్ నాయకులు మేకపోతుల మల్లయ్య, యాదగిరి, దేవులపల్లి అజయ్, సంపత్ కుమార్, షిరిడీ సుధాకర్, శంకర్ గౌడ్, రాధ, భాస్కర్ రెడ్డి, సత్యవతి, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *