Breaking News

జర్నలిస్టులకు వేజ్ బోర్డు కోసం కమిటీ

wage board for journalists

-ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణలో జర్నలిస్టులకు వేజ్ బోర్డు ఇంప్లిమెంటేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. జర్నలిస్టులకు, ప్రతికాధిపతులకు మధ్య ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వేజ్ బోర్డు సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక త్రైపాక్షిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వేతన బోర్డు ఎంత ఉండాలో ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. దీని అమలును పర్యవేక్షిస్తుంది. ఈ వేజ్ బోర్డు తెలంగాణలోని పత్రికలు, టీవీచానాల్స్ కు వర్తిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

కమిటీలోని సభ్యులు వీరే..
1. పి.వి శ్రీనివాస్-టీన్యూస్
2. కే. చంద్రశేఖర్, ప్రెసిడెంట్, హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్
3. కె.రంగయ్య – నమస్తే తెలంగాణ
4. సుమ బాల – వీ6 చానల్
5. బైసా దేవదాసు – నేటి నిజం పత్రిక
6.గంగాధర్ -ఫొటోగ్రాఫర్ -నమస్తే తెలంగాణ
7. హష్మీ – సియాసత్ పత్రిక

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *