Breaking News

జర్నలిస్టులకు డబుల్‌ బెడ్‌ రూం ఫ్లాట్‌లను కేటాయించండి

wgl journa photo

 

వరంగల్‌ నగరంలో పనిచేస్తున్న వర్కింగ్‌ జర్నలిస్టులకు డబుల్‌ బెడ్‌ రూం ఫ్లాట్‌లను కేటాయించాలని కొరుతూ వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణను కెసిఆర్‌ జర్నలిస్ట్స్‌ మ్యూచివల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ హౌజింగ్‌ సోసైటీ లిమిటెడ్‌ ప్రతినిధులు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలిశారు. నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కెసిఆర్‌ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌ రూం ఫ్లాట్‌ స్కీంలో ఇళ్లు లేని అర్హులైన జర్నలిస్టులకు కేటాయించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. పరిశీలించిన కలెక్టర్‌ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు తెలిపారు. ఇంటి స్థలాల విషయంలో ప్రభుత్వం సందిగ్ధంలో ఉన్న పరిస్థితిలో డబుల్‌ బెడ్‌ ఫ్లాట్స్‌ నైనా వరంగల్‌ నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇవ్వాలని ఈ సందర్భంగాప్రతినిధులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే వీటిపైన నిర్ణయం తీసుకొనున్నట్టు ఆమె తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో హౌజింగ్‌ సోసైటీఅధ్యక్షుడు కె. అనిల్‌ కుమార్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి కె. కుమారస్వామీ, టియుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొంతు రమేశ్‌, తుమ్మ శ్రీధర్‌రెడ్డి, వల్లాలరమణ, బాలకుమార్‌, కంకణాల సంతోష్‌, మోహన్‌, బుచ్చిరెడ్డి, దొమ్మాటి శ్రీకాంత్‌, గాడిపెల్లి మధు, చెరుకు వేణుప్రసాద్‌, తిరుమల్‌ తదితరులున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *