Breaking News

జర్నలిస్టులకు జీతాలివ్వట్లేదట..

cvr

హైదరాబాద్ : లేబర్ కమిషన్ కు జీతాల కోసం టీవీ జర్నలిస్టులు క్యూ కడుతున్నారు. తమకు వేతనాలు చెల్లించేలా ఆదేశించాలని ఫిర్యాదు చేస్తున్నారు. సీవీఆర్ న్యూస్, 6 టీవీలపై అందులో పనిచేస్తున్న ఉద్యోగులు వేతనాలు చెల్లించడం లేదని లేబర్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. విచారణకు స్వీకరించిన లేబర్ కమిసనర్ ఈ నెల 7న సీవీఆర్ ఉద్యోగులకు, 11వ తేదీన 6 టీవీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ఆదేశించింది.

6tv

జర్నలిస్టుల పరిస్థితే ఇలా ఉంటే సామన్యుని పరిస్థితి ఇంకేంటని ఆయా యాజమన్యాలను లేబర్ కమిసన్ ప్రశ్నిచింది. నిర్ణీత గడువులోగా బాధిత ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని .. లేనిపక్షంలో తదుపరి చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఇంకెవరైనా వేతనాలు రావాల్సి ఉంటే ఆయా తేదిల్లో సాయంత్రం 3 గంటల సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని లేబర్ కమిషనర్ ఆఫీసుకు వెళ్లాలని జర్నలిస్టులు సూచిస్తున్నారు. వివరాలకు 9032042014లో సంప్రదించగలరు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *