జర్నలిస్టులకు జగన్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి..?

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ విలేకరుల సమావేశం.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల పై జగన్ విమర్శలు చేశారు. ఏకపక్షంగా అసెంబ్లీని నడిపారని.. వైసీపీ ఎమ్మెల్యేలను కొని కలుపుకున్నా స్పీకర్ స్పందించడం లేదని ధ్వజమెత్తారు..

ఈ సందర్భంగా జగన్ విలేకరులపై కూడా మండిపడ్డారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ‘మనమందరం బాగా చదువుకున్న వాళ్లం.. జర్నలిస్టులుగా మీరు పత్రికలు, టీవీల్లో సమస్యలు తీసుకొస్తున్నారు. నిజాయితీగా పనిచేసే మీరు సీఎం చంద్రబాబు పదిమంది వైసీపీ ఎమ్మెల్యేలను డబ్బిచ్చి టీడీపీలో కలుపుకుంటే కనీసం ఎందుకు రాయడం లేదంటూ ’ విలేకరులను నిలదీశారు జగన్.. దమ్ముంటే వాళ్లతో రాజీనామా చేయించి గెలుపించుకోవాలని జగన్ చంద్రబాబుకు సవాల్ విసిరారు. జర్నలిస్టులైన నిజాయితీ వైసీపీ ఎమ్మెల్యేల జంపింగ్ లపై రాయడం లేదని మండిపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *