Breaking News

జర్నలిస్టులకు అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు

journlists meeting2

హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ జర్నలిస్టుల మొర సీఎం కేసీఆర్ ఆలకించారు. ఎట్టకేలకు తెలంగాణలోని పాత్రికేయులందరికీ హెల్త్ కార్డులు, అక్రిడేషన్లు ఇచ్చేందుకు నిర్ణయించారు. విలేకర్లతో పాటు డెస్క్ లో పనిచేసే జర్నలిస్టులకు సైతం సమానంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు. అంతేకాదు హైదరాబాద్ లోని జర్నలిస్టులకు మూడు పడక గదుల ఇళ్లను అపార్ట్ మెంటుల్లో నిర్మించి ఇస్తామని పునురుద్ఘాటించారు.

శనివారం హైదరాబాద్ లోని ప్రెస్ అకాడమీని సందర్శించిన ఆయన సీనియర్ జర్నలిస్టులతో సమావేశమై ఈ నిర్ణయాలను తీసుకున్నారు. అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సమాచార, పౌరసంబంధాల కమిషనర్ చంద్రవదన్, సీనియర్ జర్నలిస్టులు, పాత్రికేయ సంఘాల నేతలు ఇందులో పాల్గొన్నారు.

10 కోట్లతో సంక్షేమ నిధి

journlists meeting

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు ఎలాంటి ప్రీమియం లేకుండా ఆరోగ్యకార్డులు, అక్రిడేషన్లు ఇస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధిగా ఈ ఏడాది 10 కోట్లను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే శాసనసభా సమావేశాలకంటే ముందే జర్నలిస్టులకు ఈ కార్డులు అందజేస్తామని ప్రకటించారు. అంటే మార్చిలోగా జర్నలిస్టులందరికీ హెల్త్ , అక్రిడేషన్ కార్డులు అందనున్నాయి..

హెల్త్, అక్రిడేషన్ కార్డులపై 9 మందితో కమిటీ..
సీఎం ఆదేశాల మేరకు అక్రిడేషన్లు, హెల్త్ కార్డులకు ఎవరు అర్హులో తేల్చేందుకు 9 మందితో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఈ కమిటీలో సీనియర్ జర్నలిస్టులు రాంచంద్రమూర్తి, కే.శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ రెడ్డి,శైలేష్ రెడ్డి, వెంకటకృష్ణ, జహీర్ అలీఖాన్, గౌరీశంకర్, క్రాంతి, వనజలు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *