
హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణలోని ప్రతీ జర్నలిస్టుకి (డెస్క్ జర్నలిస్టులతో సహా) సంక్షేమ పథకాలు దక్కే విధంగా నివేదిక రూపొందించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీకి తమ సూచనలు అందజేసినట్లు ఐజేయూ మాజీ సెక్రెటరీ జనరల్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర యూనియన్ విస్తృత స్థాయి సమావేశం సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కే.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అక్రిడేషన్లు, వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య కమిటీకి తమ సూచనలను నివేదిక రూపంలో అందజేశామన్నారు. అక్రిడిటేషన్లు, వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య బీమా విషయంలో గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశామన్నారు.
కార్యక్రమంలో ఐజేయూ సెక్రెటరీ జనరల్ అమర్, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు అమర్ నాథ్, యూనియన్ ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజేయూ కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ, ఆలపాటి సురేష్ కుమార్, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరుణాకర్, కోశాధికారి మహిపాల్ రెడ్డి, హెచ్ యూ జే అధ్యక్ష కార్యదర్శులు కోటిరెడ్డి, చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు అయిలు రమేశ్, కే.రాంనారాయణ, రాజేశ్, సంపత్ కుమార్, వీణావాణి, తాటికొండ భాస్కర్, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కే. ప్రబాకర్ రెడ్డి (నల్గొండ), శ్రీనివాసరావు (నల్గొండ), శ్రీనివాస్ ( మహబూబ్ నగర్) , శివకుమార్ (వరంగల్), రమణ (వరంగల్), గాండ్ల శ్రీనివాస్ ( కరీంనగర్), అంగిరేకుల సాయిలు (నిజామాబాద్), రంగాచారి(మెదక్), వెంకటేశ్వరావు, ప్రసేన్ (ఖమ్మం) , వెంకటరెడ్డి (రంగారెడ్డి), ప్రకాష్ రెడ్డి (మంచిర్యాల) , మహేందర్ రెడ్డి (ఆదిలాబాద్) తదితరులు పాల్గొన్నారు.