
పరకాల, ప్రతినిధి : జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్నదని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నేనని.. వర్కింగ్ జర్నలిస్టులందరికీ (డెస్క్ జర్నలిస్టులతో సహా) ప్రయోజనం కలిగించేందుకు పాటుపడ్డామని ఐజేయూ నాయకులు దేవులపల్లి అమర్ అన్నారు. వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని పుష్పాంజలి గార్డెన్ లో టీయూడబ్ల్యూజే యూనియన్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా అధ్యక్షులు శివకుమార్ అధ్యక్షత వహించారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి , టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్, రాష్ట్ర నాయకులు దాసరి కృష్ణరెడ్డి, అయిలు రమేశ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఐజేయూ నాయకులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులందరికీ (డెస్క్ జర్నలిస్టులతో సహా) అక్రిడేషన్లు, ఇళ్లస్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఈ విషయమై ప్రభుత్వం నియమించిన కమిటీకి సైతం నివేదిక సమర్పించామని చెప్పారు. కానీ కొందరు కావాలనే తమపై దృష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జర్నలిస్టుల సంక్షేమమే మా ధ్యేయం అని అన్నారు.
గత సీఎం ల కంటే ప్రస్తుత సీఎం కేసీఆర్ జర్నలిస్టుల పట్ల సానుకూలంగా ఉన్నారని.. వేజ్ బోర్డు కమిటీ, హెల్త్ కార్డులు ఇచ్చారని.. తెలంగాణలో పెద్ద సంఘమైన తాము జర్నలిస్టుల కోసం ఎన్నోసార్లు ఆందోళనల్లో పాల్గొన్నామని పునరుద్ఘాటించారు.
టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ మాట్లాడుతూ కొందరు ఫేస్ బుక్ ద్వారా తమ టీయూడబ్ల్యూజే నాయకులపై తప్పుడు ప్రచారం చేశారని.. కానీ జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతుంది తమ సంఘమేనన్నారు.. ఇటీవల మెదక్ జిల్లాలో ఓ జర్నలిస్టు క్యాన్సర్ బారిన పడితే మూడు లక్షల చెక్ ను సీఎం ద్వారా ఇప్పించామని చెప్పారు. అలాంటి తమపై మీడియాలో అభాసుపాలు చేయడం సరికాదన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అద్యక్షులు శివకుమార్, నాయకులు నరసింహరాములు, పరకాల ప్రెస్ క్లబ్ అద్యక్షులు జి.జగదీశ్వర్, పాత్రికేయ మిత్రులు సదానందం, సురేందర్, వెంకటేశ్వర శర్మ, మామిడి శరత్, అయిలయ్య, శ్రీనివాసరెడ్డి
నాయకులు సంపత్ కుమార్, సిరికొండ భాస్కర్,వీణావాణి, గడ్బం కేశవమూర్తి, సాగర్, జగదీశ్వర్, మధు, తోట సుధాకర్, విద్యాసాగర్, కన్న పరుశరాం, జిల్లా పాత్రికేయులు పాల్గొన్నారు.