జర్నలిజం వద్దు.. స్వయం ఉపాధే ముద్దు

-పత్రిక రంగంలో ఉద్యోగాల కోతతో స్వయం ఉపాధి వైపు జర్నలిస్టుల అడుగులు
కరీంనగర్, ప్రతినిధి : ‘తుమ్మితే ఊడిపోయే జాబ్ లో ఎన్నాళ్లు చేస్తాం బాస్.. ఎప్పుడు ఉత్తరం వస్తుందో.. ఎప్పుడు పోస్టు ఊస్టు అవుతుందో అంటూ టెన్షన్ లైఫ్ అవసరమా.. అందుకే సొంత కాళ్లపై నిలబడదాం..’ అంటున్నారు జర్నలిస్టులు..

సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులకు మంచి ఉపాధి, జాబ్ సెక్యూరిటీ, మంచి వేతనాలు లభించాయి.. రాష్ట్రం పెద్దది కావడం.. యాడ్స్ ఎక్కువగా రావడం.. రెవెన్యూ ఎక్కువగా ఉండడంతో జర్నలిస్టులకు మంచి అవకాశాలు లభించాయి. కొన్నేళ్లుగా అరకొర వేతనాలతో అరగోస పడుతున్న కాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన సాక్షి, మరో పత్రిక సూర్య రంగ ప్రవేశంతో జర్నలిస్టుల జీవితాల్లో ఘననీయంగా మార్పు వచ్చింది. అప్పటివరకు రూ.5వేలు ఉన్న సగటు జీతాలు సాక్షి ఎంటరైన తర్వాత రాజశేఖర రెడ్డి చలువతో రూ.10వేలకు పైగా పెరిగాయి.. జర్నలిస్టులకు మంచి వేతనాలు.. ఉద్యోగ భద్రత పెరిగాయి.. ఈ పోటీవల్ల ఇన్నాళ్లు మగ్గిపోయిన ఇతర పత్రికల్లోని జర్నలిస్టులకు సైతం వేతనాలు భారీగానే పెరిగాయి..

ఇప్పుడేమైంది మరీ..?
రాష్ట్రం విడిపోవడం జర్నలిస్టులకు భారీ నష్టాన్ని మిగిల్చిందనే చెప్పొచ్చు.. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు రెవెన్యూ, యాడ్స్, పెట్టుబడి సమకూరి పార్టీలు తమ ప్రయోజనాల కోసం పత్రిక రంగాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ ఏర్పాడ్డాక పరిస్థితి మారిపోయింది. చిన్న రాష్ట్రం కావడం.. పత్రిక యాజమాన్యాలన్నీ ఎక్కువగా ఆంధ్రా పెట్టుబడీదారులవీ కావడంతో తెలంగాణలో ప్రస్తుతం జర్నలిజం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వైఎస్ జగన్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన సారథ్యంలో నడుస్తున్న సాక్షి పత్రిక ఒడిదుడుకులకు లోనవతోంది. ప్రతిపక్షంలో ఉండడం.. ఖర్చులు పెరగడంతో ఆయన సాక్షి పత్రిక అన్ని ఎడిషన్లను ఎత్తివేసి.. కేవలం వరంగల్, హైదరాబాద్, రాజమండ్రి, మంగళగిరి, తిరుపతి లకే పరిమితం చేశారు.. వందల మందికి ఉపాధినిచ్చిన సాక్షి ఇప్పడు అంతే నిర్ధయగా ఖర్చులు తగ్గించుకునేందకు సబ్ ఎడిటర్లు` రిపోర్టర్లకు మంగళం పాడుతోంది. ఎప్పడు కంటేనర్ వస్తుందో.. ఎవరి ఉద్యోగం పోతుందోనని నరాలు తెగేలా నరకయాతన పడుతున్నారు సాక్షిలో పనిచేస్తున్నారు ఉద్యోగులు.. ఇక మరో పత్రిక సూర్యలో అయితే రెండేళ్ల క్రితమే మూతపడింది. అందులో జీతాలివ్వకపోవడంతో ఎవరూ పనిచేయడం లేదు.. ఇక ఆంధ్రజ్యోతిలో ఎదీ ఎక్కువగా ఉండదు.. ఎక్కువ జీతం ఉండదు.. ఎక్కువ మంది ఉండరు.. అది లిమిటెడ్ ఎడిషన్.. ఇక సీపీఐ, సీపీఎం ల విశాలాంధ్ర, ప్రజాశక్తిలు జిల్లా ఎడిషన్లను ఎత్తివేసి హైదరాబాద్ కు తరలించాయి.. అందులోని సబ్ ఎడిటర్లను రోడ్డున పడేశాయి.. కొత్తగా మన తెలంగాణ, నవ తెలంగాణతో పత్రికలు తెస్తున్నాయి కమ్యూనిస్టు పార్టీలు.. అవి హైదరాబాద్ కేంద్రంగానే దీంతో స్థానిక జర్నలిస్టులకు ఉపాధి కరువవుతోంది.

ఈనాడులో సైతం  ఎడిషన్లను.. ఉద్యోగులను తగ్గించి హైదరాబాద్ కు తగ్గించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ సపోర్ట్ ఉన్న నమస్తే తెలంగాణలో ప్రస్తుత క్రైసెస్ లో జీతాలు పెంచమని.. ఉంటే ఉండొచ్చు .. వెళ్లేవాళ్లు వెళ్లొచ్చంటున్నారట..

 దీంతో తెలంగాణ ఏర్పడ్డాక తమ జీవితాలు మారిపోతాయనుకున్న జర్నలిస్టులకు ఉద్యోగాలు పోయి దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏదో ఊహించాం.. ఏదో ఆశించాం కానీ ఇంతటి భయంకర పరిస్థితులు జర్నలిజంలో ఎప్పుడు ఎదురుకాలేదని వాపోతున్నారు జర్నలిస్టు మిత్రలు.. ఉద్యోగ భద్రత లేక.. టెన్సన్ తట్టుకోలేక సాక్షి లో పనిచేస్తున్న చాలా మంది స్వయం ఉపాధి పొందడానికి కరీంనగరంలో సొంతంగా వ్యాపారాలు ప్రారంభించారు. జర్నలిజం ఇక మాకు వద్దంటూ చాలా మంది ఇతర వృత్తులకు డైవర్ట్ అవుతున్నారు. మిగతా పత్రికల్లో పనిచేస్తున్న వారు కూడా పత్రిక రంగం సేఫ్ కాదంటూ ప్రత్యామ్మాయాలు ఆలోచిస్తున్నారు.. మున్ముందు జర్నలిజం ఏ తీరాలకు చేరుతుందో వేచిచూడాలి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.