
చైన్నై : తమిళనాడు సీఎం జయలలితకు మళ్లీ చిక్కులు వచ్చిపడ్డాయి. కర్ణాటక హైకోర్టు వెలువరించిన తీర్పుతో నిర్ధోషిగా విడుదలై తమిళనాడు సీఎంగా పీఠమెక్కిన అమ్మ జయలలితకు కర్నాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జయ కేసుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జయలలితకు ఎదురు దెబ్బ తగిలింది.