జయలలితతో పోలిస్తే నేను వేస్టే..

తమిళనాడు సీఎం జయలలితతో పోలిస్తే తాను వేస్ట్ అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. జయలలిత తమిళనాడు సీఎంగా ఇంటికే పరిమితమవుతుందని.. కనీసం తన నియోజకవర్గంలో తనలా ఎప్పుడు పర్యటించదని.. అయినా ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రత్యర్థులకు డిపాజిట్లు రావని కానీ తనకే ఇలా ఎందుకు జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో తనకు మెజారిటీ రాకపోవడంపై ఆయన నియోజకవర్గ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు..

కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలిచి సీఎం అయిన చంద్రబాబు నిన్న తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ప్రజలతో మమేకమయ్యారు. జయలలిత తన సొంత ఇల్లు పోయేస్ గార్డెన్ లోనే ఉంటే ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలో ప్రత్యర్థులకు డిపాజిట్లే రావన్నారు. కానీ తాను మాత్రం కుప్పంలో గెలవడానికి కష్టపడతానన్నారు. అంతగా మెజారిటీ రాదన్నారు. సీఎంగా తనకే ఇలా అయితే మామూలు నాయకుల పరిస్థితి ఏంటని.. కుప్పంను ఇంత అభివృద్ధి చేస్తున్నా తనకు ఓట్లు ఎందుకు పడడం లేదని కార్యకర్తలపై మండిపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.