
జమ్ము కాశ్మీర్ లో మళ్లీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులగా జమ్మూ కురుస్తున్న భారీ వర్షాలకు జీలం నదితో సహా నదులన్నీ ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. గడిచిన 7 నెలల్లో ఇలా వరదలు రావడం తరచుగా జరుగుతున్నాయి. వరదల వల్ల జనం నిరాశ్రయిలవుతున్నారు. ఈ సారి వచ్చిన వరదలకు 9 మంది మృత్యువాత పడ్డారు.