
హైదరాబాద్, ప్రతినిధి : జమ్ముకాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బిజెపి సన్నాహాలు ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో పొత్తులపై చర్చలు వేడెక్కుతున్నాయి. జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా పిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఉండేందుకు బిజెపితో చేతులు కలుపుతున్నారు. బిజెపి అగ్రనేతలు అరుణ్‌జైట్లీ, రామ్‌మాధవ్‌తో చర్చలు జరుపుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రెండు పార్టీలు ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం.
ఎన్‌సికి డిప్యూటి సిఎం, ఓ మంత్రి పదవి, రాజ్యసభ సీటు ఇవ్వడానికి బిజెపి అంగీకరించినట్టు తెలుస్తోంది. బిజెపికి 25 స్థానాలు, ఎన్సీ 15 స్థానాల్లో గెలుపొందాయి. ఒమర్ బుధవారం రాష్ట్ర సీఎం పదవికి రాజీనామా చేశారు. తర్వాతి ప్రభుత్వంలోనూ తాము కీలక పాత్ర పోషిస్తామని ఒమర్ సూచన్ ప్రాంయంగా తెలిపారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యత బిజెపి, పీడీపీలకు ఉందని, పొత్తు విషయంలో తాను వేచి చూస్తానని తెలిపారు.