
జమ్మికుంట హుజూరాబాద్ రోడ్డుకు మహర్ధశ మొదలైంది. జమ్మికుంట నుంచి హుజూరాబాద్ వరకు 4లైన్ల రోడ్డుకు రాష్ట్ర్ర ఆర్ధిక శాఖా మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం నాడు జమ్మికుంట లో శంఖుస్ధాపన చేశారు. అలాగే హుజూరాబాద్ నుండి కన్నారం గ్రామం వరకు 2లైన్ల రోడ్డుకు సైతం మంత్రి ఈటెల రాజేందర్ శంఖుస్ధాపన చేశారు. ప్రముఖ వ్యాపార కేంద్రమైన జమ్మికుంటకు 4లైన్ల రోడ్డు ప్రభుత్వం శ్రీకారం చుట్టటం పట్ల ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టుదలతో హుజూరాబాద్ అభివృద్ధికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్న మంత్రి ఈటెల రాజేందర్ ను పలువురు అభినందిస్తున్నారు. మంగళవారం జరిగిన పలు శంఖుస్ధాపన కార్యక్రమాల్లో హుస్నాబాద్ శాసన సభ్యులు ఒడితెల సతీష్ కుమార్, పలువురు జెడ్పీటిసి సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.