
హైదరాబాద్, ప్రతినిధి : జబర్దస్త్ ఆర్టిస్ట్ వేణుపై జరిగిన దాడిని సినీ, టీవీ ఆర్టిస్టులు తీవ్రంగా ఖండించారు. వేణుకు మద్దతుగా జబర్దస్త్ టీమ్ సభ్యులు అండగా నిలిచారు. ఈమేరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సినీ నటుడు నాగబాబు ఫిర్యాదు చేశారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి గానీ, ఆర్టిస్టులపై దాడులు చేయడం ఏంటని నాగబాబు ప్రశ్నించారు.
జబర్దస్త్ షోలోనే తాము ఎవరినీ ఉద్దేశించి చేసినవి కాదని ట్యాగ్ లైన్ వేస్తామని.. కేవలం వినోదం కోసమే తమ ప్రయత్నమని.. ఎవరి మనోభావాలను కించపరచడం మా ఉద్దేశం కాదన్నారు. కామెడీ ప్రోగ్రాం హిట్ కావాలంటే కొన్ని తప్పనసరి అని వాటిపై ఇలా దాడులు జరగడం దారణమని జబర్దస్త్ టీం సభ్యులు మండిపడ్డారు. వెంటనే దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జబర్దస్త్ వేణుపై దాడి ఎలా జరిగిందో యూట్యూబ్ లో వీడియో అప్ లోడ్ అయ్యింది. దాన్ని మనం పైన చూడొచ్చు..