
-స్కిట్ లో తమ అవమానించారంటూ ఆగ్రహం
హైదరాబాద్ : బుల్లితెరపై ‘జబర్ధస్త్’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ‘వేణు’పై దాడి జరిగింది. ఆదివారం ఫిల్మ్ నగర్ లో ఉన్న ఆలయంలో అయ్యప్ప ఇరుముడి కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వేణు వచ్చారు. ఓ సామాజిక వర్గం వారు దాడి చేశారు. ఓ కామెడీ షోలో తమ సామాజిక వర్గాన్ని అవమానించేలా స్కిట్ చేశాడనే ఆరోపణతో వేణుపై దాడి చేశారు. ఎట్టకేలకు సంఘటనాస్ధలికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు వేణును రక్షించి , పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ దాడిలో వేణుకు గాయాలైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
‘జబర్ధస్త్’ షోలో ఓ సామాజికవర్గాన్ని కించపరుస్తూ వేణు టీం స్కిట్ చేశారని ఆ వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని నేతలు ఈ నెల 18వ తేదీన ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.