జపాన్ మ్యాగ్ లైవ్ రైలు వేగం గంటకు 603 కి.మీలు

జపాన్ : ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన రైలును జపాన్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. మ్యాగ్ లైవ్ రైలును ప్రయోగాత్మకంగా నడిపించారు. ఈ రైలు ఏకంగా గంటకు 603 కి.మీలకు పైగా స్పీడుతో పరుగులు పెట్టింది. ఇదో రికార్డు.. ఇన్నాళ్లు 400 కి.మీ పైనే చైనా, జపాన్ రైళ్లు పరిగెత్తేవి. కానీ రాకెట్ వేగంతో ఈ మ్యాగ్ లైవ్ రైలు ప్రయాణిస్తోంది.  ఇదే ట్రైన్ 2003లో  581 కి.మీ ల వేగాన్ని సాధించింది. ఇటీవలే ఇది 590కి.మీ ల స్పీడుతో వెళ్లింది. తాజా బుల్లెట్ రైలు  దాదాపు 11 సెకన్లపాటు  గంటకు 603 కి.మీలకు పైగా వేగంతో దూసుకెళ్లడం కన్పించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *