Breaking News

జపాన్ జర్నలిస్ట్ తలనరికిన ఐఎస్ఐఎస్

ఢిల్లీ,ప్రతినిధి : జపాన్ జర్నలిస్ట్ ను ఐఎస్ఐఎస్ హతమార్చింది. తల నరికి వీడియోను యూట్యూబ్ లో పెట్టింది. జపాన్ కు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కెంజిగొటో తలసరికి ఆ వీడియోని విడుదల చేశారు. జపనీయులు ఎక్కడ కనబడినా చంపేస్తామంటూ వీడియోలో హెచ్చరించారు. జపాన్, జోర్డాన్ మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించి ఎలాంటి ఒడంబడిక కుదరకపోవడంతో ఐఎస్ ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు.

కాగా అంతకుముందే ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న యుకావాను రక్షించేందుకు కెంజీ గొటో ఇటీవల సిరియా వెళ్లాడు. అయితే అతని తలకూడా ఉగ్రవాదులు నరికివేసి తమ కిరాతకాన్ని చాటుకున్నారు. ఐఎస్ ఉగ్రవాదులు జపనీయుల రక్తాన్ని తాగేందుకు తహతహలాడేందుకు కెంజీని హతమార్చిన ఐఎస్ ఫైటర్ జిహాదీ జాన్ వ్యాఖ్యానించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *