Breaking News

జన్మభూమికి ఎన్ఆర్ఐలు సహకరించాలి: పల్లె రఘునాధ్ రెడ్డి

జన్మభూమికి  ఎన్ఆర్ఐలు సహకరించాలి: పల్లె రఘునాధ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్ర రాజధాని నిర్మాణంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ పల్లె రఘునాధ్ రెడ్డి కోరారు. పెట్టుబడులను ఆకర్షించడానికి కాలిఫోర్నియాలోని మిల్ పిటాస్ స్వాగత్ రెస్టారెంట్ లో అక్కడ ఉన్న తెలుగువారితోబుధవారం నాడు ఆయన సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పల్లె రఘునాధ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పట్టేవారికి ఏపీ ప్రభుత్వం అందించే సహకారం గురించి, తెలుగు సంస్ర్కతి కాపాడడానికి మనపై ఉన్న బాధ్యతను ఆయన గుర్తు చేశారు. అలానే విదేశాలలో ఉన్న తెలుగువారికి కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తాము వాటికి పరిష్కార మార్గాలు చూపుతామని తెలిపారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు తమ సొంత గడ్డ గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. మన రాష్ట్ర్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలని, దానికి విదేశాల్లో ఉంటున్న తెలుగువారి సహయ సహకారాలు తప్పక అవసరం అవుతాయని, జన్మభూమి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రపంచంలోనే అత్యున్నతంగా నిర్మిస్తామని పెట్టుబడులకు, ఐటీ పరిశ్రమలకు స్వర్గదామంగా వెలుగొందగలదనే ఆశాభావాన్ని వెల్లిబుచ్చారు. బే ఎరియాలో ఎన్ఆర్ఐ ప్రముఖ నాయకుడు కోమటి జయరాం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కూడా ఎన్ఆర్ఐలు పాలు పంచుకోవాలని ఆయన కోరారు. ఐటీ మినిస్టర్ పల్లె రఘునాధ రెడ్డి బె ఎరియాకు వచ్చినందుకు సంతోషమన్నారు. జయరాం కోమటి, వెంకట్ కోగంటి, వీరు ఉప్పల మరియు బే ఎరియా ఎన్ఆర్ఐ తెదేపా పల్లె రఘునాధ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ కోగంటి, యశ్వంత్ కుదరవల్లి, వీరు ఉప్పల, వేమూరి సతీష్, ప్రసాద్ మంగిన బాబు ప్రత్రిపాటి, రజనీకాంత్ కాకర్ల, శ్రీకాంత్ కోనేరు, శ్రీకాంత్ దొడ్డపనేని, సతీష్ అంబటి, గోకుల్, జట్టి వెంకయ్య, రవి ఉప్పల, జేపీ పేజెండ్ల, కృష్ణమోహన్, కరుణ్ వెలిగేటి, లియోన్ బి, వల్లూరి పల్లి శ్రీను, భాస్కర వల్లభనేని, శ్రీని వల్లూరుపల్లి, విజయ అసూరి, హను కొత్తపల్లి, గాంధీ పాపినేని, శ్రీనాధ్ కోనంకి, వినయ్ పరుచూరి, ఉమ ఉప్పలపాటి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *