
హైదరాబాద్ : జనవరి 5లోపు అన్ని సెట్ల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని.. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ఉన్నత విద్యామండలి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. దుందుడుకు నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్‌కు ముప్పు వాటిల్లుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి పరీక్షలు నిర్వహించేందుకు.. ఇంతకుముందే ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. చట్టంలో ఉన్నట్టుగానే ఏపీని కలిసి రమ్మంటున్నామని తెలిపారు.