
సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న శంకర్ “ఐ” చియాన్ విక్రమ్ కథానాయకుడుగా హాలీవుడ్ చిత్రాల స్ధయికి ప్రముఖ దర్శకుడు శంకర్ రూపోందించిన “ఐ” చిత్రం ఆడియో సోని మ్యూజిక్ ద్వారా డిసెంబర్ 30న విడుదలై సంగీత ప్రియుల వద్ద నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఎక్కడ..విన్న “ఐ” పాటల జోరే ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ అందించిన సంగీతం అందరినీ అలరిస్తోంది. ఈ భారీ విజువల్ వండర్ ని ఆస్కార్ ఫిలింస్ వి.రవిచంద్రన్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ఫ్రై.లిమిటెడ్
అధినేతలు కలిసి సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు, అన్ని పనుల్ని పూర్తి చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ
చిత్రంలో చియాన్ విక్రమ్ సరసన యామీజాక్సన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సురేష్ గోపి, ఉపేన్ పటేల్, సంతానం, రాంకుమార్ గణేషన్, శ్రీనివాసన్, సయ్యద్ సిద్దిక్
మొదలైన వారు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.