జనవరి 1న ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ 

నవీన్‌చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్‌ బ్యానర్‌పై జగదీశ్‌ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్‌ కామినేని నిర్మించిన చిత్రం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. ఈ చిత్రానికి సంగీతం ఎమ్‌. ఎమ్‌. కీరవాణి. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని న్యూ ఇయర్‌ 2016 కానుకగా జనవరి 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

0471
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జగదీశ్‌ తలశిల మాట్లాడుతూ….”అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ రూపుదిద్దుకుంది. అల్రెడీ ఎస్‌.ఎస్‌. రాజమౌళిగారి చేతుల మీదుగా విడుదల అయిన ఆడియోకి శ్రోతల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఎమ్‌. ఎమ్‌. కీరవాణిగారు అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌ కానుంది. ఉత్కంఠ భరితంగా అన్ని కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. న్యూ ఇయర్‌ 2016 కానుకగా..జనవరి 1వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము…” అన్నారు.
నవీన్‌చంద్ర, లావణ్య త్రిపాఠి, జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్‌, నర్రా శీను తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎమ్‌.ఎమ్‌. కీరవాణి, పాటలు: శివశక్తిదత్తా, అనంతశ్రీరాం, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరావు, డిఓపి: ఈశ్వర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఈ. మధుసూదన్‌రావు,
నిర్మాత: సాయిప్రసాద్‌ కామినేని,
రచన-దర్శకత్వం: జగదీశ్‌ తలశిల

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *