Breaking News

జనవరి 1నుంచి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు లేవు..

20slide4

న్యూఢిల్లీ : కొత్త సంవత్సరంలో ఉద్యోగార్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురునందించింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, అనుబంధ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల్లో జూనియర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించకూడదని కేంద్రం ఆదేశించింది. నైపుణ్య, శరీర దారుఢ్య పరీక్షలు కొనసాగించవచ్చని పేర్కొంది.. ఇంటర్వ్యూల రద్దు ప్రక్రియలకు ఈనెల 31 చివరి తేది అని పేర్కొంది.. ఈమేరకు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల కార్యదర్శకులకు సర్య్కూలర్ లను ఆదేశించింది.

కాగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్రూప్ 2, 4 ఉద్యోగాలకు వెంటనే కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ఇంటర్వ్యూలు రద్దు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇవన్నీ చేస్తేనే నిరుద్యోగుల కష్టాలు తీరుతాయని.. ఉద్యోగాల్లో అవినీతి, లంచాలు కనుమరుగవుతాయిన స్పష్టం చేసింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *