జనమా..గులాబీ వనమా..

జనమా..గులాబీ వనమా..IMG-20180903-WA0221
– ప్రగతి నివేదనకు జన నీరాజనం
– రహదారులపైనా కిక్కిరిసన ప్రజావాహిని
– గులాబీమయమైన కొంగరకలాన్
– దేశ చరిత్రలో రికార్డు
– ముందస్తు ఎన్నికలకు సంకేతాలిచ్చిన సీఎం కేసీఆర్
– మళ్లీ ఆశీర్వదించాలని పిలుపు
– త్వరలో రాజకీయ ప్రకటన చేయనున్నట్లు వెల్లడి
టీఆర్ఎస్ పార్టీ మరోసారి తన సత్తాను చాటింది. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభ గులాబీ వనాన్ని తలపించింది. దేశ చరిత్రలో రికార్డు సృష్టించింది. కనీవినీ ఎరగని రీతిలో నిర్వహించిన మహాసభ జనసంద్రమైంది.  టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని సభలను కొంగరకలాన్ టీఆర్ఎస్ సభ బద్దలు కొట్టింది.గతంలో ఎవరూ నిర్వహించని, భవిష్యత్ లో ఏ పార్టీకీ సాధ్యం కాని విధంగా సభను విజయవంతం చేశారు.తెలంగాణ ఆవిర్భవించిన అనంతరం టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత చేపట్టిన పథకాలపై సీఎం కేసీఆర్ ప్రజలకు వివరించారు. రాష్ట్ర్ర ప్రభుత్వ పథకాలతో లబ్దిపొందామని కొందరు, ఏళ్ల తరబడి ఎదురు చూసిన కష్టాలు టీఆర్ఎస్ హయాంలో తీరాయని మరికొందరు తరలి వచ్చి సీఎం ప్రసంగాన్ని విన్నారు. 31 జిల్లాల నుంచి లక్షలాది మంది పోటెత్తారు. ప్రగతి నివేదన సభలోని 13 గ్యాలరీలు  పూర్తిగా నిండిపోయాయి. కిలోమీటర్ల మేర రహదారులు కిక్కిరిసిపోయాయి. అందరి అంచనాలకు మించి ప్రగతి నివేదన సభ విజయవం కావడంపై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇది ఇలా ఉంటే ‘ప్రజలారా మళ్లీ ఆశీర్వదించండి’ అని కేసీఆర్ ఇచ్చిన పిలుపు ముందస్తు ఎన్నికలకు సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించే విధంగా 25 లక్షల మందితో సభను నిర్వహించడంతో ఇతర పార్టీల్లో వణుకు మొదలైంది. ప్రగతి నివేదన సభ ప్రకటన, అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన, ముందస్తు ఎన్నికల అంశం తెరపైకి రావడం వంటి పరిణామాలు సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారని చెప్పకనే చెప్పాయి. ప్రత్యే రాష్ర్టంలో టీఆర్ఎస్ చేపట్టిన అబివృద్ధితో పాటు, భవిష్యత్ రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం యావత్ దేశం దృష్టి ఆకర్షించింది.
మరోవైపు ఈ మహాఘట్టంలో పాలుపంచుకునేందుకు తెలంగాణ ప్రజలు దండు కట్టారు. రాష్ట్ర్ర వ్యాప్తంగా 25 లక్షల మందిని తరలించడానికి టీఆర్ఎస్ ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పల్లపల్లెకూ ప్రగతి నివేదనను తీసుకెళ్లారు. మహాసభకు ఒక రోజు ముందు నుంచే పెద్ద ఎత్తున జనాన్ని తరలించారు. కరీంనగర్ జిల్లా మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 300 బస్సులు, 70 ట్రాక్టర్లు, 30 డీసీఎంలు, 200 ఇతర వాహనాల్లో
జనం తరలి IMG-20180903-WA0096వెళ్లారు. జనగామ జల్లా పాలకుర్తిలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి శనివారం వంద ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. నియోజకవర్గం నుంచి 30 వేల మందిని తరలించారు. ఆదివారం 225 బస్సులు, 124 డీసీఎంలు, 100 కార్లలో జనం ఎమ్మెల్యే ఎర్రబెల్లి ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో 190 బస్సులు, 200 కార్లలో జనం బయల్దేరారు. ధర్మపురి  నియోజకవర్గం నుంచి25 వేల మందిని తరలించారు. ఆదివారం 210 బస్సులు, 105 కార్లలో జనం ఎమ్మెల్యే ,ప్రభుత్వఛీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో తరలి వెళ్లారు.        జగిత్యాల నియోజకవర్గంసంజయ్ కుమార్ ఆధ్వర్యంలో225 బస్సులు, 210 కార్లలో బయల్దేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల నుంచి 50 వేల మంది తరలి వెళ్లారు. 200 ఆర్టీసీ బస్సులు, 300 స్కూల్  బస్సులు, మరో వంద ఇతర వాహనాలతోపాటు 300 ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ర్యాలీని ప్రారంభించారు. జగిత్యాల జిల్లా నుంచి 40 వేల మందిని  తరలించారు.  కోరట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జగిత్యాల నియోజకవర్గ ఇన్ చార్జి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో 500 వాహనాలను సిద్ధం చేశారు.  చొప్పదండి నియోజకవర్గం నుంచి 250 బస్సులు, 50 డీసీఎంలు, 500 కార్లలో జనం బయల్దేరారు.
  సిద్దిపేట జిల్లా నుంచి 3 వేల వాహనాల్లో జనం సభకు వెళ్లారు. ఉప్పల్ నుంచి 1000 బైక్ లతో కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. శేరిలంగింపల్లి నుంచి ఎమ్మెల్యే గాంధీ ఆధ్వర్యంలో 450 బస్సులు, 700 ట్రాక్టర్లు, 200 ఆటోల్లో తరలి వెళ్లారు. మేడ్చల్  ప్రతాప సింగారం నుంచి 4000 బైక్ లపై కార్యకర్తలు ర్యాలీగా తరలి వెళ్లారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ర్యాలీ ప్రారంభించారు. స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యే రాజయ్య ఆధ్వర్యంలో1116 వాహనాల్లో జనం తరలి వెళ్లారు. జయశంకర్ భూపాలపెల్లి నియోజకవర్గం నుంచి 175 బస్సులు, 104 డీసీఎంలు, 75 ఇతర వాహనాల్లో బయల్దేరారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం నుంచి 200 వాహనాలు, తాండూరు నియోజకవర్గం నుంచి 200 బస్సులు, 150 జీపుల్లో బయల్దేరారు. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సంజీవ్రావు ఆధ్వర్యంలో 140 బస్సులు, 60 తుఫాన్లు,  50 సొంత వాహనాల్లో సభకు వెళ్లారు. సంగారెడ్డి  జిల్లా నారాయణ ఖేడ్ నుంచి 260 బస్సులు, 600 తుఫాన్లు 100 సుమోల్లో తరలి వెళ్లారు.
 ఖమ్మం నియోజకవర్గం నుంచ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో 300 బస్సులు, 300 ఇతర వాహనాల్లో తరలి వెళ్లారు. వైరా నియోజకవర్గం నుంచి 175 బస్సులు, 100 కార్లలో బయల్దేరారు. కల్లూరులో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డీసీసీబీ  చైర్మన్ మువ్వా ర్యాలీ ప్రారంభించారు. పాలేరు నియోజకవర్గం నుంచి 250 బస్సులు, 150 కార్లు, 30 డీసీఎంలు, 50 తుఫాన్లు, 300 ట్రాక్టర్లలో తరలి వెళ్లారు. మధిర నియోజక వర్గం నుంచి 163 బస్సులు, 17 తుఫాన్లు, 118 కార్లలో జనం బయల్దేరారు. భద్రాది కొత్తగూడెం నియోజకవర్గం నుంచి  ఎమ్మెల్యే జంగం వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో 250 బస్సులు, 250 ఇతర వాహనాల్లో  తరలి వెళ్లారు. పినపాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 250 బస్సులు, 200 ఇతర వాహనాలు, ఇల్లందు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కోరం కనుకయ్య ఆధ్వర్యంలో  200 బస్సులు, 300 ఇతర వాహనాలు ఏర్పాటు చేశారు. పాల్వంచనుంచి 70 బస్సుల్లో బయల్దేరారు. భద్రాచలం నుంచి 30 బస్సులు, 100 కార్లలో తరలి వెళ్లారు. అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 120 బస్సులు, 170 ట్రాక్టర్లలో సభకు బయల్దేరారు.
 బోథ్ నియోజకవర్గం నుంచి 468 వాహనాలు, ఆదిలాద్ నియోజకవర్గం నుంచి 264 వాహనాల్లో తరలి వెళ్లారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్  నుంచి 50 బస్సులు, 60 ఇతర వాహనాల్లో బయల్దేరారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ లో 1500 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వెళ్లారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి 101 బస్సులు, 250 ఇతర వాహనాలను ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రారంభించారు.  మంచిర్యాల చౌరస్తాలో 140 బస్సులు, 100 ఇతర వాహనాలను ఎమ్మెల్యే దివాకర్ రావు జెండా ఊపారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి 150 బస్సులు, 200 ఇతర వాహనాల్లో బయల్దేరారు. ఎమ్మెల్యే నల్లాల ఓదెలు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి 150 బస్సులు, 100 ఇతర వాహనాల్లో తరలివెళ్లారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జెండా ఊపారు. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్ల నుంచి 10 వేల మంది కార్మికులు బయల్దేరారు. నిర్మల్ నుంచి 600 వాహనాల ర్యాలీని టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి విఠల్ రావు ప్రారంభించారు. ముథోల్ నుంచి 670 వాహనాల్లో సభకు బయల్దేరారు.  ఖానాపూ ర్ నుంచి ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంలో 700 వాహనాల్లో తరలివెళ్లారు.
నిర్మల్ నియోజకవర్గం నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో162 బస్సులు, 166 టవేరాలు, 233 ఇతర వాహనాల్లో బయల్దేరారు.  వరంగల్ మేయర్ క్యాంప్ కార్యాలయం నుంచి 220 వాహనాలను ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ నరేందర్ ప్రారంభించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో 360 బస్సులు, 200 కార్లు, 25 డీసీఎంలు, 310 స్కూల్ బస్సులు,  400 బైక్ లోతో బయల్దేరారు. వరంగల్ రూరల్ నర్సంపేట నుంచి సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ సిద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో 255 బస్సులు, 120 డీసీఎంలు, 110 ట్రాక్టర్లు, 150 జీపుల్లో జనం బయల్దేరారు. వర్ధన్న పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆధ్వర్యంలో 255 బస్సులు, 100 డీసీఎంలు, 135 ట్రాక్టర్లు, 125 ఇతర వాహనాల్లో తరలి వెళ్లారు. పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆధ్వర్యంలో 125 బస్సులు, 250 ఇతర వాహనాల్లో తరలి వెళ్లారు.  మహబూబాబద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే రెడ్యానాయక్ నాయకత్వంలో 200 బస్సులు, 30 డీసీఎంలు, 80 కార్లలో బయల్దేరారు. మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో 205 బస్సులు, 5 డీసీఎంలు, 40 కార్లు, 400 బైక్ లపై బయల్దేరారు.
జనగామ జిల్లా కేంద్రంలోని మరో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి 90 ట్రాక్టర్లతో చేపట్టిన ర్యాలీని ప్రారంభించారు. ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు నియోజకవర్గాల నుంచి 1000 వాహనాల్లో బయల్దేరారు. దేవరగొండ నుంచి 200 వాహనాలు, నాగార్జున సాగర్ నుంచి 300, నల్లగొండ నియోజకవర్గం నుంచి 200 బస్సులు, కామారెడ్డి జిల్లా జక్కల్ నియోజకవర్గం నుంచి 226 బస్సులు, 316 తుపాన్లు, 100 కార్లు, 12 డీసీఎంలలో జనం బయల్దేరారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి1100 తుఫాన్లు, 250 బస్సులు, 250 కార్లలో కార్యకర్తలు, ప్రజలు బయల్దేరారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి 300 బస్సులు, 1300 కార్లలో తరలి వెళ్లారు. నిజామాబాద్ జిల్లా నుంచి 6 వేల వాహనాలు, నిజామాబాద్ అర్బన్ నుంచ 145 బస్సులు, 180 ఇతర వాహనాల్లో జనం బయల్దేరారు.  బాల్కొండ నియోజకవర్గం నుంచ 225 బస్సులు, 415 ఇతర వాహనాల్లో తరలి వెళ్లారు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎస్సీ కార్పొరేషన్ పడిమర్తి రవి ఆధ్వర్యంలో 50 బస్సులు, 100కార్లలో జనం బయల్దేరారు.  పెద్దపల్లి నియోజకవర్గం నుంచి 260 బస్సులు, 200 కార్లలో ప్రగతి నివేదన సభకు  తరలి వెళ్లారు. రామగుండం నియోజకవర్గం నుంచి 150 బస్సులు, 250 కార్లలో నాయకులు ప్రజలు బయల్దేరారు.
  1. IMG-20180902-WA0164IMG-20180903-WA0139IMG-20180903-WA0138

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.