
శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. మెకానిక్ గా కనిపిస్తున్న ఎన్టీఆర్ లుక్ ఊరమాస్ గా కనిపిస్తోంది.. మైత్రీ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. మళయాళ నటుడు మోహన్ లాల్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు..