జనగామ జిల్లా కలెక్టర్ భవన సముదాయానికి శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

జనగామ జిల్లా  కలెక్టర్ భవన సముదాయానికి  ఉప ముఖ్యమంత్రికడియంశ్రీహరిబుధవారంశంకుస్థాపన చేశారు. జనగామ జిల్లా ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా కడిిియం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెెెెలిపారు. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, బమ్మెర పోతన, పాల్కురి సోమనాధుడు తిరిగిన నేల జనగామ. ఎంతో చారిత్రక విశిష్టత ఉన్న జనగామ భవిష్యత్ లో కూడా అభివృద్ధిలో అంత విశిష్టత సాధించాలి. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో సిద్దిపేట మొదటి స్థానంలో ఉంటే..జనగామ వేగంగా అభివృధ్ధి చెందుతోంది. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే అభివృద్ధి లో నెంబర్ వన్ స్థాయికి వచ్చే అవకాశం ఉంది అని ఆయన తెలిపారు . జనగామ జిల్లా కోసం ఇక్కడి 3 ఎమ్మెల్యేలతో కలిసి పట్టు పట్టాను.  ఈరోజు జనగామ జిల్లా కలెక్టర్ భవన సముదాయానికి శంకుస్థాపన చేసే అవకాశం ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల వచ్చింది. వచ్చే ఏడాది నాటికి ఈ భవన సముదాయాన్ని పూర్తి చేసి ప్రారంభోత్సవానికి వస్తాను.తెలంగాణ వస్తే ఎమోస్తది అన్నవాళ్లకు..తెలంగాణ వస్తే జనగామ జిల్లా వచ్చింది. జనగామ లో 1,30,000 కుటుంబాలకు రక్షిత మంచినీటి ఇవ్వబోతున్నాం.1994 నుంచి 2004 వరకు నేను మంత్రిగా ఉన్నప్పుడు వేసవిలో ప్రతి ఏటా ట్రాక్టర్లతో నీళ్లిచ్చే పరిస్థితి ఉంటే..నేడు నల్లా ద్వారా ఇంటింటికి నీరు ఇస్తున్నాం. ఇంతకంటే మార్పు ఇంకేం కావాలి.జనగామ జిల్లాలో 11 మండలాల్లో 2,86,000 ఎకరాలకు దేవాదుల ద్వారా నీరు ఇస్తున్నాం. జిల్లాలో ఎన్నడూ నీరు కనిపించని చెరువుల్లో నేడు నీరు నుండి ఉంది. దేవాదుల మూడో దశ పనులకు 6000 కోట్ల రూపాయల పరిపాలన అనుమతులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారు. దేవాదుల ద్వారా ఎక్కువ లబ్ది జనగామ జిల్లాకు జరగనుంది. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి గోదావరి నీరు తీసుకొచ్చి ఇక్కడ నీళ్లు తాగిన రుణం తీసుకుంటాను.కరువు కాటకాల జనగామ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కచ్చితంగా పెద్ద రిజర్వాయర్ ఉండాలని సీఎం కేసీఆర్ ని అడిగితే..ఇక్కడి సమస్యను గుర్తించిన సీఎం 4000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే 10 టి ఎం సి ల సామర్థ్యంతో కూడిన మల్కాపూర్ రిజర్వాయర్ కు అనుమతి ఇచ్చారు. దీనితో జనగామ లో ప్రతి ఎకరా సస్యశ్యామలం కానుంది అని కడిిియం తెెెెలిపారు.నూతనంగా ఏర్పడిన జనగామ జిల్లాకు  ఇక్కడి ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి ఔటర్ రింగ్ రోడ్డు ను సీఎం కేసీఆర్ ని కోరి మంజూరు చేయిస్తాను.జనగామ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడంలో భాగంగా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.వ్యవసాయ రంగం ప్రాధాన్యతగా గుర్తించి, రైతును రాజు చేయాలనే లక్ష్యంతో అనేక పథకాలు అమలు జరుగుతున్నాయి. లక్ష రూపాయలలోపు రుణాల మాఫీలో భాగంగా 17వేల కోట్ల రుణాలు మాఫీ జరిగింది. రైతులకు ఎకరానికి ఏటా రెండు పంటలకు 8000 రూపాయల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతోంది. ఇందుకోసం రైతు సమన్వయ సమితిలు వేసి వచ్చే ఏడాది నుంచి ఇన్ పుట్ సబ్సిడీ రైతు ఖాతాలకు నేరుగా జమ చేయనున్నారు.గతంలో కరెంటు కోతలకు నిరసనలు జరిగితే..తెలంగాణ వచ్చాక 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నారు. 24 గంటలు విద్యుత్ కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా ఇస్తుంటే…ఇన్ని గంటల విద్యుత్ వద్దని నిరసనలు చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించామో తెలుసుకోవాలి.

   సమావేశంలో     ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో పాటు  ఎంపీలు పసునూరి దయాకర్, బూర నర్సయ్య గౌడ్, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, ప్రభుత్వ విప్ బోడెకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రాజయ్య, జీ సి సి చైర్మన్ గాంధీ నాయక్, కలెక్టర్ దేవసేన, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.