జనం కక్కుర్తిలో కమండలం..

భారత దేశ జనం నాడి తెలుసుకాబట్టే ఈ కార్పొరేట్ కంపెనీలు చాలా బాగా తమ ప్రాడక్ట్స్ అమ్ముకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో జనం నమ్మి మోసపోతున్నారు.

భారత దేశ జనానికి ప్రొడక్ట్స్ నాణ్యత కన్నా దానికి వచ్చే ఫ్రీ వస్తువులపైనే మోజు ఎక్కువ.. ముఖ్యంగా ఇంటి బాధ్యతలు నిర్వర్తించే మహిళలకు సబ్బులు కొంటే దానికి పెన్ను వస్తుందా.. చెంచా వస్తుందా అని ఆలోచిస్తారు. అంతేకాని సబ్బు నాణ్యత గురించి పట్టించుకోరు.. సబ్బు ఎలాగు మంచి వాసన వస్తుంది.. ఒళ్లు తోముకోవచ్చు. కానీ దానికి వచ్చే పెన్నో, చెంచానో ఇంట్లో ఉపయోగపడుతుంది కదా..

ఇదిగో ఈ భారతీ య మహిళల ఆశలే కార్పొరేట్ పెట్టుబడిదారులకు కాసులు కురిపిస్తున్నారు. సంతూర్ సబ్బులు బాగుంటున్నాయని జనం కొనట్లేదు.. దానికి ఓ పెన్నో.. లేక ఇప్పుడు కొత్తగా స్పూన్ (చెంచా) ఇస్తున్నారు కాబట్టే దాన్ని విరగబడి కొంటున్నారు. మిగతా సబ్బులు ఏం ఇవ్వట్లేదు కాబట్టి కొనట్లేదు.. భారతీయ మహిళల ఈ ఆసక్తిని గమనించే కార్పొరేట్ కంపెనీలు తమ సబ్బు గురించి కాకుండా కేవలం దానికి ఇచ్చే గిఫ్ట్ లమీదే ఆధారపడి ప్రచారం నిర్వహిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.