
గుజరాత్ అంటేనే సింహాలకు పెట్టింది. అలాంటి రాష్ట్రానికి చెందిన భారత క్రికెటర్ రవీంద్రజడేజా ఈ మధ్యనే పెళ్లయింది. వడోదర యువతిని చేసుకున్నాడు. ఇవాళ తన భార్య తో కలిసి గుజరాత్ లోని ప్రఖ్యాత వన్యమృగ పార్క్ ను సందర్శించాడు. సింహాలకు కొద్ది దూరంలో తన జిప్సీ వాహనాన్ని ఆపి కిందకు దిగి సింహాలకు కొంత దూరంలో కూర్చున్నాడు. భార్యతో, ఫారెస్ట్ గార్డులతో కలిసి సెల్ఫీలు దిగారు.
గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ లో సింహాల పార్క్ లో విజిటర్లు లేదా టూరిస్టులు ఎవరూ తమ వాహనాలు ఆపరాదు.. కిందకు దిగి వన్య ప్రాణులను రెచ్చగొట్టడం వంటివి చేయరాదు. కానీ ఆ రూల్ ను జడేజా అతిక్రమించాడు. దీంతో జడేజాపై చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులు యోచిస్తున్నారట.. దీంతో భారత క్రికెటర్ జడేజా చిక్కుల్లో పడ్డాడు.