Breaking News

జగన్ పై టీడీపీ మరో సెటైర్

ys-jagan-setire-960x630

హైదరాబాద్, ప్రతినిధి : నిన్న ఇండియన్ ఆఫ్ ది ఇయర్ లో పకడ్బందీ గా కేసీఆర్ ను ఓడించిన టీడీపీ శ్రేణులు ఇప్పడు అదే ఇంటర్నెట్ ను ఉపయోగించి వైఎస్ జగన్ దీక్షపై సెటైర్ విసిరారు.

తెలుగు దేశం పార్టీ ఫేస్ బుక్ ద్వారా వైఎస్ జగన్ రైతు దీక్షను ఎత్తి పొడిచింది. జగన్ రైతులకు రుణమాఫీ జరగలేదంటూ రెండు రోజుల క్రితం నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.. ఈ సమావేశంలో మాట్లాడినట్టు రైతుల్ని రుణమాఫీ అయ్యిందా అడిగితే .. చంద్రబాబు దయ వల్లే అయ్యిందన్నట్టుగా చూపారు.

దాంతోపాటు వైఎస్ జగన్ తన మామకు ధర్నాకు వచ్చిన వాళ్లందరికీ బిర్యానీ పొట్లాలు పంచాలని చెప్పినట్టు సెటైర్ విసిరింది.

హైటెక్ బాబు తన ప్రచారాన్ని, ఇంటర్ నెట్ ద్వారా బాగానే వాడుకున్నట్టు దీని ద్వారా అర్థమవుతోంది. ఏమాత్రం సందు దొరికినా ప్రతిపక్షాలను, ప్రత్యర్థి పార్టీలను ఫేస్ బుక్ ద్వారా తెలుగుదేశం పార్టీ, నారాలోకేష్ లు కడిగిపారేస్తున్నారు. సెటైర్ లతో నెట్ లో హల్ చల్ చేస్తున్నారు. దీనివెనుక మొత్తం నారాలోకేష్ హస్తం ఉందని ఇన్ సైడ్ టాక్.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *