
వైఎస్ జగన్ దీక్ష భగ్నమైంది.. గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో జగన్ ను తరలించారు. అర్ధారాత్రి పోలీసులు జగన్ దీక్ష శిభిరం వద్దకు చేరుకున్నారు. జగన్ దీక్షను చాలాసేపు కార్యకర్తలు అడ్డుకున్నారు. జగన్ ను తరలించడానికి నిరాకరించారు. పోలీసులు అతికష్టం మీద జగన్ ను దీక్ష శిబిరం వద్ద చేరుకొని కార్యకర్తలను చెదరగొట్టి అంబులెన్స్ లో జగన్ ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
జగన్ ను ఆస్పత్రికి తరలించకుండా రోడ్డుపై కార్యకర్తలు అడుగడుగునా అడ్డుపడ్డారు. ఎలాగోలా ఆస్పత్రికి చేర్చిన వైద్యులు అనంతరం జగన్ ను చికిత్స చేయడానికి ప్రయత్నించగా ఆయన నిరాకరించారు. తాను ఆస్పత్రిలో నే దీక్ష చేస్తానని చెప్పారు. కానీ వైద్యులు సీరియస్ గా పరిస్థితి ఉందని.. ఫ్లూయడ్స్ ను జగన్ కు గ్లూకోజ్ ద్వారా ఎక్కించారు. దీంతో జగన్ దీక్ష భగ్నమైంది.