
హైదరాబాద్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మరో ఛార్జీషీట్ దాఖలైంది. ఇది 11వ ఛార్జీషీట్. కాగా, ఇందులో మొత్తం 14 మందిని నిందితులుగా సిబిఐ పేర్కొంది. జగన్, ఇందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, విజయసాయి, అప్పటి గృహనిర్మాణశాఖ ఎండీ మహంతి పేర్లను ఛార్జీషీట్ లో నమోదు చేశారు. వైఎస్ హయాంలో ఇందూకు అప్పగించిన 4గృహ నిర్మాణ ప్రాజెక్టులు కూకట్ పల్లి, నాగోలు, గచ్చిబౌలీ, నంద్యాలలో అక్రమాలు జరిగాయని సీబీఐ నిర్దారించింది. ఇందూకు తక్కువ ధరకే భూములు కేటాయించారని వైఎస్ పై సిబిఐ ఆరోపించింది. భూకేటాయింపులకు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో ఇందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి రూ.70కోట్లు పెట్టుబడి పెట్టినట్లుగా సిబిఐ పేర్కొంది