Breaking News

జంప్ జిలానీలకు మైండ్ వాష్

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న నేతల మైండ్ ను టిపిసిసి వాష్ చేస్తోంది. రేపో మాపో కొందరు నేతలు గులాబీ గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది. దీనితో హై కమాండ్ ఆదేశాలతో టిపిసిసి రంగంలోకి దిగింది. జంప్ జిలానీ అవుతారని భావిస్తున్న దానం నాగేందర్ తో టిపిసిసి నేతలు మాట్లాడారు.
బ్రేక్ లు వేయాలన్న హై కమాండ్..
తెలంగాణలో అధికారానికి దూరం కావడంతో కాంగ్రెస్‌ను వలసలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే సింగిల్ గా కొందరు గ్రూపులుగా మరికొందరు పార్టీకి హ్యాండిచ్చి కారెక్కి పోతున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జూనియర్, సీనియర్ అన్న తేడా లేకుండా గులాబీ గూటికి చేరిపోతున్నారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక నల్గొండ జడ్పీ చైర్మన్ సైతం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ హైకమాండ్… ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి హుకుం జారీ చేసింది. తక్షణమే వలసలకు బ్రేకులు వేయాలని సీరియస్‌గా ఆదేశించింది.
దానంతో మాట్లాడిన నేతలు..?
తాజాగా పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్ఎస్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే దానం గులాబీ బాస్‌తో టచ్‌లో ఉన్నారని… రేపో మాపో గులాబీ కండువా కప్పుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అటు టీఆర్‌ఎస్‌తో పాటు.. ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ గమనిస్తున్న హస్తిన పెద్దలు వీటికి తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టాలని పొన్నాలకు ఆదేశించింది. అధిష్టాన ఆదేశాలతో పొన్నాలతో పాటు ఎఐసిసి నేత కుంతియా, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, అంజన్‌కుమార్ యాదవ్‌లు దానంతో మాట్లాడినట్లు టాక్‌. దీంతో మీటింగ్ తర్వాత తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు దానం.
ఫలిస్తాయా ?
కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న భరోసా కల్పించారు నేతలు. ఎలాగైనా గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పవర్ దక్కించుకునే విధంగా యాక్టివ్ కావాలని ఆదేశించారు. గ్రేటర్ లో పార్టీ నుంచి ఎవరు వీడటం లేదని పొన్నాల ధీమా వ్యక్తం చేస్తున్నారు. వలసలపై పార్టీకి డ్యామేజ్ జరగకముందే ఇక నుంచి ఇలా పార్టీ మారాలనే ఆలోచన ఉన్న నేతలకు మైండ్ వాష్ చేసి దారిలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. మరి వీరి బుజ్జగింపులు, హితోపదేశాలు ఏమేరకు జంప్ జిలానీలకు బ్రేకులు వేస్తాయో చూడాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *