
-టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలపై హైకోర్టులో పిటీషన్లు..
హైదరాబాద్, ప్రతినిధి : అధికార టీఆర్ఎస్ పార్టీ ఆకర్ష్ తో పార్టీ మారిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రాష్ట్ర హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మారిన వారిపై స్పీకర్ చర్య తీసుకోవడంలేదని.. వారిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు హైకోర్టులో వేర్వేరుగా పిటీషన్ దాఖలు చేశారు. తలసాని, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డిలపై అనర్హత వేటు వేయాలని ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, సండ్ర లు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 9 మంది ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా గుర్తించాలంటూ కాంగ్రెస్ కూడా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
మొత్తం మీద గతప్రభుత్వంలోలా పార్టీ మారిన వారిపై మిన్నకుండే పరిస్తితిలో ప్రస్తుత పార్టీలు లేవు. హైకోర్టుకు వివాదం చేరడంతో దీనిపై జనవరి 27 తేదీలోగా వివరణ ఇవ్వాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది.
దీంతో ఇక పార్టీ మారిన ప్రజాప్రతినిధులకు కష్టకాలం మొదలైంది. తప్పినసరిగా రాజీనామా ఆమోదించుకొని ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఆ ఎన్నికల్లో గెలుస్తామో లేదో అన్న టెన్షన్ వారిని పట్టి పీడిస్తోంది.