Breaking News

జంతుశాస్ర్తంలో పీ.హెచ్‌డీ చేసిన గిరిజ‌న విద్యార్థిని ఘ‌నంగా స‌న్మానించిన మంత్రి జోగు రామ‌న్న‌

జంతుశాస్ర్తంలో పీ.హెచ్‌డీ చేసిన గిరిజ‌న విద్యార్థిని ఘ‌నంగా స‌న్మానించిన మంత్రి జోగు రామ‌న్న‌

జంతుశాస్ర్తంలో గిరిజ‌న విద్యార్థికి పీ.హెచ్‌డీ

గిరిజ‌న గూడెం నుంచి ఓయూ క్యాంప‌స్ వ‌ర‌కు ప్ర‌స్థానం

ఘ‌నంగా స‌న్మానించిన మంత్రి జోగు రామ‌న్న‌

హైద‌రాబాద్‌, జూలై 13 : ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజ‌న గూడెంకు చెందిన గిరిజ‌న విద్యార్థి మెస్రం నాగేశ్వ‌ర్ జంతుశాస్ర్తంలో పీ.హెచ్‌డీ సాధించారు. ఆదిలాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బేల మండ‌లంలోని సోన్‌కాస్ గిరిజ‌న ప్రాంతానికి చెందిన మెస్రం నాగేశ్వ‌ర్ గూడెం నుంచి ఉస్మానియా యూనివ‌ర్సిటీ వ‌ర‌కు ప్ర‌స్థానాన్ని సాగించారు. జంతుశాస్ర్తంలో న్యూరో బ‌యోలాజీ విష‌యంలో ఆ విద్యార్థి పీ.హెచ్‌డీ ప‌త్రాలు స‌మ‌ర్పించారు. పీ.హెచ్‌డీ సాధించిన మెస్రం నాగేశ్వ‌ర్‌ను బీసీ సంక్షేమం, అట‌వీ శాఖ‌ల మంత్రి జోగు రామ‌న్న శుక్ర‌వారం స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్‌లో ఘ‌నంగా స‌న్మానించారు. జీవితంలో మ‌రిన్ని శిఖ‌రాలు అధిరోహించాల‌ని మంత్రి జోగు రామ‌న్న దీవించారు. ప్రొఫెస‌ర్ కే. ప్ర‌తాప్‌రెడ్డి నేతృత్వంలో మెస్రం నాగేశ్వ‌ర్ పీ.హెచ్‌డీ పూర్తి చేశారు. ఎలుక‌పై ప్ర‌యోగ ప‌త్రాల‌ను కూడా స‌మ‌ర్పించారు. ఎలుక‌కు ఫ్లోరోసిస్ వ్యాధిని సోకించి.. వ‌న‌మూలిక‌ల‌తో త‌యారు చేసిన లేహ్యం కొర్సిటిన్ అనే మందుతో ఫ్లోరోసిస్ వ్యాధిని న‌యం చేసిన ఘ‌న‌త మెస్రం నాగేశ్వ‌ర్ సాధించారు. మెస్రం నాగేశ్వ‌ర్ ప‌ద‌వ త‌ర‌గ‌తి నుంచి ఎంఎస్సీ వ‌ర‌కు ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లోనే విద్య‌ను కొన‌సాగించారు. మెస్రం నాగేశ్వ‌ర్ త‌ల్లిదండ్రులు జ‌నార్థ‌న్‌, శాంతాబాయిలు వ్య‌వ‌సాయ కూలీలు. మెస్రం నాగేశ్వ‌ర్‌ను స‌న్మానించిన వారిలో టీఆర్ ఎస్ రాష్ర్ట నాయ‌కులు పైడిప‌ల్లి ర‌వీంద‌ర్ రావు, జుట్టు అశోక్‌, విద్యార్థి జేఏసీ నాయ‌కుడు రుయ్యాడి ద‌త్తాద్రి, నాయ‌కులు గెడాం ప్ర‌వీణ్‌, గెడాం విలాస్‌, క‌లీం త‌దిత‌రులు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *