చొప్పదండి బ్యాంకు దోపిడీ దొంగలు వీరే..

కరీంనగర్ : రెండేళ్ల క్రితం కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్బీఐ దోపిడీ చేసింది నల్గొండలో పోలీసుల చేతిలో హతమైన దొంగలేనని పోలీసులు నిర్ధారించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అస్లాం, అయూబ్ లు సిమీ కార్యకర్తలని వీరు తమిళనాడు, మహారాష్ట్ర , కర్నాటక, పూణేల్లో దాడులకు తెగబడ్డారని పేర్కొన్నారు. ఈ ఉగ్రవాదులు దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతూ బెదిరింపులకు పాల్పడతారని అందులో భాగంగానే సూర్యపేట తనిఖీల్లో పట్టుబడి పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. వీరిని నల్గొండ జిల్లాలో పోలీసులు మట్టుబెట్టడంతో వీరిని గుర్తించామని తెలిపారు. వీరు ఉత్తరప్రదేశ్ లోని జైలు నుంచి తప్పించుకు తిరుగుతున్నారని తెలిపారు.

022

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *