చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఈటెల

10

కరీంనగర్ : తెలంగాణ ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం గంగాధర మండలంలోని గట్టుబూత్కుర్ గ్రామంలోని ఊరచెరువులో మిషన్ కాకతీయ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈటెల, ఎమ్మెల్యే బొడిగె శోభ, జడ్పీ చైర్మన్ తుల ఉమ మాట్లాడారు..

07

మిషన్ కాకతీయలో చెరువులను బాగు చేసి తాగు, సాగునీటికి కొరత లేకుండా చేస్తామన్నారు. జిల్లాలోని చొప్పదండిలో అత్యధిక పించన్లు అందజేస్తున్నామని ఈటెల అన్నారు. ప్రతీ పేదవాడికి అన్ని పథకాలను అందేలా చూస్తామన్నారు. అనంతరం చొప్పదండి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఈద శంకర్ రెడ్డి, కరీంనగర్ టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

091112131415

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *