చైనా వస్తువుల అమ్మకాలు తగ్గాయి..

 ఇప్పుడు దేశంలో చైనాపై భారతీయులు ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీ , మోడీ నేతలు పరోక్షంగా చైనా వస్తువులను బాయ్ కాట్ చేయాలంటూ ఇచ్చిన పిలుపు ఇప్పుడు దేశంలో వైరల్ లా మారుతోంది. ప్రతి ఒక్కరు చైనా వస్తువులను కొనడం మానేస్తున్నారు. దివాళీ సందర్భంగా బాణాసంచాతో పాటు చైనా తయారీ వస్తువులను కొనకుండా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. ఎంతగా అంటే 40 శాతం సేల్స్ పడిపోయాయి. ఎల్‌సిడి టీవీల కొనుగోళ్లు 15 శాతం పడిపోయాయి. చైనా మొబైల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ గూడ్స్‌ సేల్స్ కూడా విపరీతంగా పడిపోయాయి. దీపావళి సందర్భంగా చైనా ఉత్పత్తులను కొనరాదంటూ కొన్ని సంస్థలిచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. భారతీయులు స్వదేశీ వస్తువులనే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

చైనా ఉత్పత్తులకు వ్యతిరేకంగా భారతీయుల్లో ఇంతటి మార్పు ఇటీవలి కాలంలో ఇదే ప్రధమమని చెబుతున్నారు. యూరీ దాడి తర్వాత కూడా పాకిస్థాన్‌ను వెనకేసుకొస్తున్న చైనాకు బుద్ధి చెప్పాలని కొన్ని సంస్థలు, ముఖ్యంగా బీజేపీ, తెరవెనుక మోడీ పిలుపునిచ్చారు.. మసూద్ అజహర్ లాంటి ఉగ్రవాదిపై నిషేధం పడకుండా కాపాడుకుంటూ వస్తున్న చైనాకు గుణపాఠం నేర్పాలన్న పిలుపునకు వస్తున్న స్పందన అనూహ్యంగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చైనా ఉత్పత్తుల స్థానంలో భారతీయ ఉత్పత్తులనే కొంటున్నారని జైపూర్ వ్యాపార్ మహాసంఘ్ కార్యదర్శి విజయ్ వర్గీయ తెలిపారు. చైనా తయారీ డెకరేటివ్ లైట్లు, విగ్రహాల అమ్మకాలు కూడా పడిపోయాయాని వ్యాపారి శ్యామ్ మీనా తెలిపారు. స్వదేశీ ఉత్పత్తుల ధరలు చైనా ఉత్పత్తులతో పోల్చితే ఎక్కువ ధర అయినా భారతీయులు ఇండియన్ ప్రాడక్ట్స్‌నే కొంటున్నారని వెల్లడించారు. వాస్తవానికి చైనా తయారీ వస్తువుల బహిష్కరణ ఉద్యమం సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది. దాని ప్రభావమే చైనా ఉత్పత్తుల సేల్స్ పడిపోవడానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *