Breaking News

చైనా రెండో బిడ్డ స్కీంకు నో రెస్పాన్స్

n-FAMILY-GAMES-large

బీజింగ్ : చైనా ప్రభుత్వం దాదాపు 3 దశాబ్దాలుగా అమలు చేస్తున్న ఒక జంటకు ఒకే బిడ్డ కఠిన చట్టాన్ని ఇటీవల రద్దు చేసింది. ఇక నుంచి ఏ జంట అయినా రెండో బిడ్డను కనవచ్చని ఆదేశాలు జారీ చేసింది.. 1978లో లో దేశంలో పెరిగిపోతున్న జనాభాకు తిండి, పోషణ, ఆదాయం భారం కావడంతో చైనా ప్రభుత్వం ఒకే బిడ్డను అమలు చేసింది. అతిక్రమించిన వారికి భారీ జరిమానాలు, ఆబార్షన్లు, కు.ని. ఆపరేషన్లు నిర్వహించి నిర్విద్వంగా కాలరాసింది..

కానీ ఇప్పుడు దేశంతో యువత తగ్గి వృద్ధులు పెరిగిపోతున్నారట.. భారత్ లో సగటను 50శాతం యువత ఉంటే ఇప్పుడు చైనా లో 30శాతమే మిగిలారు. పెరిగిపోతున్న వృద్దులు, జననాల రేటు తగ్గుదలతో దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల ఖర్చు పెరిగిపోతోంది. దీని వల్ల దేశం దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వం మేల్కొని రెండు బిడ్డలు కనవచ్చని జంటలకు సూచించింది.

కానీ ఈ రెండో బిడ్డకు నేటి నవతరం జంటలు చైనాలో ఆసక్తి చూపడం లేదట.. ప్రస్తుతం ఒక బిడ్డను పోషించి, చదివించడానికే ఇద్దరు అమ్మానాన్నలు పనిచేసే ఆర్థిక వైచిత్తి చైనాలో ఉందట.. అందుకే ఇద్దరు బిడ్డల్ని కని పెంచే శక్తి లేదని జంటలు రెండో బిడ్డను కనడానికి ఇష్టపడడం లేదు.దీంతో చైనా అనుమతిచ్చినా అక్కడ జంటలు రెస్పాండ్ కాకపోవడం గమనార్హం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *