చైనా దేశంలో షాంగైం, లింగ్ షాన్, నాన్జింగ్, హంకాంగ్ లను సందర్శించిన కడియం టీం!

 

  • చైనాలో భారీ విగ్రహాలపై అధ్యయనం చేస్తున్న అంబేద్కర్ విగ్రహ కమిటీ
  • హంకాంగ్ లో పర్యటించి గ్యానముని బుద్ధ విగ్రహాన్ని సందర్శించిన కమిటీ సభ్యులు
  • భారీ విగ్రహాలు తయారు చేసే ఏరోసన్ కంపెనీతో మాట్లాడుతున్నాం: ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి
  • హైదరాబాద్ రాగానే భారీ విగ్రహాలపై సిఎం కేసిఆర్ కు నివేదిక అందిస్తాం: కడియం శ్రీహరి
  • వీలైనంత త్వరలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహ పనులు ప్రారంభిస్తాం: కడియం 

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహా నగరంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పడానికి నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వ పరంగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ భారీ విగ్రహాలు నెలకొల్పడంలో సుశిక్షితులైన చైనా దేశంలో పర్యటించి అధ్యయనం చేయడానికి  ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ కమిటీని చైనాకు పంపించినట్లు  ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రస్తుతం చైనాలో ఈ భారీ విగ్రహాలు నెలకొల్పే కొన్ని కంపెనీలు, భారీ విగ్రహాలున్న  ప్రాంతాలను చూసి.. ఆ  కంపెనీల వాళ్లతో మాట్లాడి మన హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి  కావల్సిన పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు.

 

గత వారం రోజులుగా చైనా దేశంలో షాంగైం, లింగ్ షాన్, నాన్జింగ్, హంకాంగ్ లలో ఈ బుద్ధ విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రదేశాలను సందర్శించినట్లు కడియం శ్రీహరి చెప్పారు. ఈ రోజు(మంగళవారం 21.02.2017) హాంకాంగ్ లో బుద్ధవిగ్రహలున్న ప్రదేశాల్లో పర్యటించామని, అందులో గ్యానముని బుద్ధ విగ్రహాన్ని సందర్శించామని తెలిపారు. దాదాపు 70 మీటర్ల ఎత్తైన బుద్ధ విగ్రహం అంటే 220 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పినట్లు వివరించారు. చైనాకు చెందిన ఏరోసన్ కంపెనీ దీనిని ఏర్పాటు చేసిందని, ఏరోసన్ కంపెనీ వారితో ఈ ఉన్నత స్థాయి కమిటీ మాట్లాడుతున్నట్లు చెప్పారు.. భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి కావల్సిన మొత్తం సమాచారాన్ని, అన్ని అంశాలను, సాంకేతికంగా, తయారీ పరంగా గల విషయాలను తెలుసుకున్నామన్నారు. ఈ కంపెనీ దగ్గర భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి కావల్సిన నైపుణ్యం, మానవ వనరులున్నాయని చెప్పారు. భారీ విగ్రహాలు నెలకొల్పేందుకు అర్హులైన కంపెనీగా దీనిని భావిస్తున్నామని, అయితే మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి హైదరాబాద్ వెళ్లిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రికి ఒక నివేదిక అందిస్తామన్నారు. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇచ్చే ఆదేశాలను బట్టి త్వరితగతిన, అంటే ఎంత వీలైతే అంత తొందరగా హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే పనులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతాయని తెలిపారు.

 

ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో పాటు విద్యుత్ శాఖ, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు బాల్క సుమన్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఆరూరి రమేష్, అధికారులు ఈ అంబేద్కర్ విగ్రహ కమిటీలో ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *