చైనాలో విలేకరికి ఏడేళ్ల జైలు శిక్ష

బీజింగ్ : చైనాలో ఓ జర్నలిస్టుకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని విదేవీ వెబ్ సైట్లకు అందిచారన్న ఆరోపణలు రుజువైనందున ఆమెకు శిక్ష విధించినట్లు ప్రకటించింది.

2013లో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఓ రహస్య సర్క్యూలర్ ను పార్టీ శ్రేణులకు పంపింది. పత్రికా స్వేచ్ఛా, ప్రజాస్వామ్యంతో పాటు 7 అంశాలపై నిషేధం అమలు చేయాలనే దానిపై పార్టీ శ్రేణులకు సమాచారం పంపింది. ఈ రహస్య పత్రాన్ని జర్నలిస్టు గావో విదేశీ మీడియాకు అందించారని చైనా ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలు రుజువైనందున గావోకు ఏడేళ్లజైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది…

కాగా జర్నలిస్టు గావోపై ప్రభుత్వం కావాలనే ఇరికించిందని.. ఆమె ప్రభుత్వ నిర్ణయాలపై వార్తలు రాయడం వల్లే ఈ కుట్రపన్నారని హక్కుల సంస్థలు ఆరోపించాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *