
బీజింగ్ : చైనాలో ఒక జంట ఒక బిడ్డను కనాలనే సంప్రదాయం చట్టం ఉంది. ఇది 1979 నుంచి అమలు చేస్తున్నారు. ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా గల దేశం కావడం వల్ల అక్కడి పాలకులు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీంతో తమకు పుట్టే ఒక సంతానం మగబిడ్డే కావాలని చాలామంది ఆడపిల్లలను పురిట్లోనే చంపి మగబిడ్డలనే కనడం మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడు చైనాలో మగపిల్లలు ఎక్కువ ఆడపిల్లలు తక్కువ అయ్యి మగవారికి ఆడపిల్ల దొరకడమే గగనమైపోతోందట..
ప్రతీ వందమంది బాలికలకు 117 మంది బాలురు చైనాలో ఉన్నారట.. దీంతో బ్యాచిలర్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయి 30 మిలియన్ల మందికి పెళ్లి కాని ప్రసాద్ లుగా మిగిలిపోయారట.. దీనిపై ఆ దేశ ఆర్థిక నిపుణులు ఒక ఆలోచన చేశారట…
జిహిజింగ్ విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడు ఎక్సియే జియోసి తన బ్లాగులలో ఈ మేరకు ఉచిత సలహా ఇచ్చారు. ఒక భార్యను ఇద్దరు మగవాల్లు పంచుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం బ్లాగుల్లో ప్రకటించారు. పెల్లికాని బ్యాచ్ లర్స్ దీనికి సమ్మతించగా.. చాలా మంది సంప్రదాయవాదులు మాత్రం దీనిపై మండిపడుతున్నారట..