చేసుకున్నోళ్లకు చేసుకున్నంత..

 పాకిస్తాన్లో తీవ్ర వాద దాడులు పెరిగిపోతున్నాయి.. ఇన్నాళ్లు ఉగ్రవాదులకు అండదండలిచ్చిన ఆ దేశంను ఆ ఉగ్రవాద భూతమే ఇప్పుడా అతలాకుతలం చేస్తోంది.. భారత్ పై ప్రత్యక్షయుద్ధం చేయలేక ఆ దేశం తయారుచేసిన ఉగ్రవాద ముఠాలు ఇప్పుడా దేశాన్ని ఆగం చేస్తున్నారు. పాకిస్తాన్ లోని విశ్వవిద్యాలయాలను , స్కూళ్లను టార్గెట్ చేసి విద్యార్థుల ప్రాణాలను తీస్తున్నారు. తాలిబాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ లోని బాచాఖాన్ విశ్వవిద్యాలయంపై తుపాకులతో విరుచుకుపడి 20మంది చంపేశారు. మరో 11మందికి తీవ్రగాయాలయ్యాయి.. ఈ దాడి తాలిబన్ పనేనని ప్రకటించింది. ఆత్మహుతి బాంబర్లు తుపాకులు చేతబూని విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.
ఈ దాడుల్లో ఓ ప్రొఫెసర్ వీరోచితంగా పోరాడి అమరుడయ్యారు. విద్యార్థులను రక్షించేందుకు తన వద్ద ఉన్న తుపాకులతో వారిని ఎదుర్కొన్నాడు. కానీ టెర్రరిస్టుల దాటికి అమరుడయ్యాడు.. నలుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ ఆర్మీ అక్కడకు చేరుకొని ఉగ్రవాదులను మట్టుబెట్టింది. కాగా కాల్పుల్లో చాలా మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు మరణించారని తెలిసింది.. అధికారులు మాత్రం అధికారికంగా 20మంది అని మాత్రమే ప్రకటించారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.