
సిడ్నీ, ప్రతినిధి : టీమిండియాతో సిడ్నీలో జరుగుతున్న ఆఖరిటెస్ట్ పై ఆట రసవత్తరంగా మారింది. ఇప్పటికే 2-0తో సిరీస్ ఖాయం చేరుకొన్న కంగారూ టీమ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికే 348 పరుగుల ఓవరాల్ ఆధిక్యంలో ఉన్న అసీస్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది..
టీమిండియాను తొలిఇన్నింగ్స్ లో 475 పరుగులకే ఆలౌట్ చేయడం ద్వారా 97 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత సంపాదించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 251 పరుగులు సాధించి..ఓవరాల్ ఆధిక్యతను 348కు పెంచుకొంది. కెప్టెన్ స్మిత్, మిడిలార్డర్ ఆటగాడు బర్న్స్ ధూమ్ ధామ్ హాఫ్ సెంచరీలు సాధించి కీలక ఆధిక్యతలో ప్రధానపాత్ర వహించారు. ఆఖరి రోజు ఆటలో టీమిండియా మ్యాచ్ నెగ్గాలంటే 350కి పైగా పరుగులు సాధించాలి..
కానీ బ్యాటింగ్ అందుకున్న టీమిండియా లక్ష్య చేదన దిశగా దూసుకెళ్తోంది. 2 వికెట్ల నష్టానికి 190 పరుగులు పైగా సాధించింది. విజయ్ 70 పరుగులతో, కోహ్లీ 25 పరుగులతో లక్ష్యందిశగా నడిపిస్తున్నారు. ఆట 5 రోజు విజయం ఎవరిని వరిస్తుందో నన్న ఉత్కంఠ నెలకొంది.